PM Shri Schools: నాలెడ్జ్ ఎకానమీగా ఇండియా..త్వరలో పీఎమ్ శ్రీ స్కూల్స్ ప్రారంభం: ధర్మేంద్ర ప్రధాన్
జాతీయ విద్యా విధానంలో భాగంగా 'పీఎమ్ శ్రీ స్కూల్స్ (PM Shri Schools)'ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం (మే 31) తెలిపారు..
Centre would be working on setting up PM Shri Schools: జాతీయ విద్యా విధానంలో భాగంగా ‘పీఎమ్ శ్రీ స్కూల్స్ (PM Shri Schools)’ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మంగళవారం (మే 31) తెలిపారు. గుజరాత్‌లో జరిగిన నేషనల్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కాన్ఫరెన్స్ ప్రసంగంలో ప్రధాన్ ఈ మేరకు వెల్లడించారు. ఇండియా నాలెడ్జ్ ఆధారిత ఎకానమీగా మారడానికి పాఠశాల విద్య పునాదిగా పనిచేస్తుందని, విద్యార్థులను ఈ దిశగా సిద్ధం చేసేందుకు ‘సీఎం శ్రీ స్కూల్స్’ స్థాపించే ప్రక్రియలో ఉన్నామని ప్రధాన్ తన ప్రసంగంలో వివరించారు.
ఈ పాఠశాలలు NEP 2020 విధానానికి ప్రయోగశాలలుగా ఉండబోతున్నాయని ఆయన అన్నారు. నూతన విద్యావిధానం అమలుపై దృష్టి సారించే దిశగా గుజరాత్‌లో ఈ కాన్పరెన్స్ ప్రారంభమైంది. ప్రీ-స్కూల్ నుంచి సెకండరీ స్కూల్ వరకు ఎన్‌ఈపీ 5+3+3+4 విధానం, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం (ECCE), టీచర్ ట్రైనింగ్, వయోజన విద్య, పాఠశాల విద్యతో నైపుణ్యాభివృద్ధిని ఏకీకృతం చేయడమే లక్ష్యంగా ఉండబోతుందని మంత్రి తెలిపారు. నాలెడ్జ్ ఎకానమీగా ఇండియాని రూపొండించడంలో రాబోయే 25 యేళ్లు చాలా కీలకం.
అందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యా మంత్రుల సహకారం అవసరం. జాతీయ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడంతోపాటు డిజిటల్ విద్యను విశ్వవ్యాప్తం చేయడానికి, దేశ యువతను విశ్వ మానవులుగా తీర్చిదిద్దడంలో ఈ విధానాలు ఉపయోగపడతాయని, అంతుకు మీ అందరి భాగస్వామ్యాన్ని కోరుతున్నానని ప్రధాన్ అన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల విద్యాశాఖ మంత్రులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.