BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..

భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL), న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్ డివిజన్ కార్యాలయంలో.. ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ అసిస్టెంట్ తదితర పోస్టుల (Business Evecutive Posts) భర్తీకి..

BECIL Recruitment 2022: బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా ఎంపిక..
Becil Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 02, 2022 | 8:05 PM

BECIL Business Evecutive Recruitment 2022: భారత ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వశాఖకు చెందిన బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (BECIL), న్యూఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లికేషన్ డివిజన్ కార్యాలయంలో.. ఒప్పంద ప్రాతిపదికన బిజినెస్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ అసిస్టెంట్ తదితర పోస్టుల (Business Evecutive Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 5

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు: బిజినెస్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ అసిస్టెంట్, ప్రూఫ్ రీడర్(ఇంగ్లిష్), మార్కెటింగ్ సూపర్‌వైజర్ పోస్టులు

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా/డిగ్రీ/ఎంకాం/పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 10, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.