NEET PG 2022 Results: నీట్‌ పీజీ 2022 ఫలితాలు విడుదల.. కేటగిరీల వారీగా కట్‌ఆఫ్‌ మార్కులు ఇవే..

నీట్‌ పీజీ (NEET PG 2022) ఫలితాలు బుధవారం (జూన్‌ 1) నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. మే 21న నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష జరుగగా.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు..

NEET PG 2022 Results: నీట్‌ పీజీ 2022 ఫలితాలు విడుదల.. కేటగిరీల వారీగా కట్‌ఆఫ్‌ మార్కులు ఇవే..
Neet Pg Results
Follow us

|

Updated on: Jun 02, 2022 | 5:26 PM

NEET PG Cut Off 2022 Category Wise: నీట్‌ పీజీ (NEET PG 2022) ఫలితాలు బుధవారం (జూన్‌ 1) నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) ప్రకటించింది. మే 21న, 849 పరీక్ష కేంద్రాల్లో నీట్‌ పీజీ ప్రవేశ పరీక్ష జరుగగా.. కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా ఖాళీగాఉన్న దాదాపు 42,000ల పీజీ సీట్ల కోసం నీట్ పీజీ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతోపాటు ఒక ఏడాది ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన 2 లక్షల మంది ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు హాజరయ్యారు. కాగా నీట్‌ పీజీ 2022 ప్రవేశ పరీక్షను ఆరు నుంచి పది వారాలపాటు వాయిదా వేయాలని దేశ వ్యాప్తంగా వేల సంఖ్యలో ఎంబీబీఎస్‌ గ్రాడ్యుయేట్లు డిమాండ్ చేసినా.. కేంద్రం వెనకడుగువేయకుండా ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారంగానే పరీక్షను నిర్వహించి, కేవలం 10 రోజుల్లోనే ఫలితాలు కూడా ప్రకటించింది. ప్రశ్నాపత్నంలో రెండు ప్రశ్నలు తప్పుగా వచ్చినందున ఆయా ప్రశ్నలను అటెంప్ట్‌ చేసినా, చేయకపోయినా పరీక్షకు హాజరయిన విద్యార్థులందరికీ రెండు మార్కులు అదనంగా కలుపుతున్నట్లు ఎన్‌బీఈ ఈ సందర్భంగా తెలియజేసింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్‌ పీజీ 2022 ప్రవేశ పరీక్షకు సంబంధించిన కట్ఆప్‌ మార్కులు కూడా విడుదలయ్యాయి. మొత్తం 800 మార్కులకు ఈ ప్రవేశ పరీక్ష జరిగింది.

నీట్‌ పీజీ 2022 కటాఫ్‌లు ఇవే..

  • జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ విద్యార్థులకు కటాఫ్: 275
  • వికలాంగ విద్యార్థులకు: 260
  • ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు: 245

సాధారణంగా ప్రతి ఏడాది జనవరిలో నీట్‌ పీజీ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. గతేడాది మహమ్మారి కారణంగా సెప్టెంబర్‌లో ఆలస్యంగా నిర్వహించారు. పరీక్ష అనంతరం కొత్తగా ప్రవేశపెట్టిన ఈడబ్ల్యూఎస్‌ కోటాకు సంబంధించి వరుస కేసుల వల్ల కౌన్సెలింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. ఫలితంగా రెండు నెలల్లో ముగియవలసిన కౌన్సెలింగ్ ప్రక్రియ నాలుగు నెలల పాటు కొనసాగింది. ఇక ఈ ఏడాది కూడా పలు కారణాల వల్ల పరీక ఆలస్యంగా జరిగింది.

ఇవి కూడా చదవండి

‘నీట్-పీజీ ఫలితాలు వెలువడ్డాయి! నీట్-పీజీకి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ నా అభినందనలు. షెడ్యూల్ కంటే ముందుగానే 10 రోజుల్లో ఫలితాలను ప్రకటించినందుకు NBEMS ప్రశంసిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్విటర్‌ ద్వారా తెలిపారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.