Trainee Pilot Cabinet Secretariat: ట్రెయినీ పైలట్లకు సదవకాశం.. కేబినేట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు..

Trainee Pilot Cabinet Secretariat: కేబినేట్‌ సెక్రటేరియట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన కేబినేట్‌ సెక్రటేరియట్‌ గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ విభాగంలో ట్రెయినీ పైలట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

Trainee Pilot Cabinet Secretariat: ట్రెయినీ పైలట్లకు సదవకాశం.. కేబినేట్ సెక్రటేరియట్‌లో ఉద్యోగాలు..
Trainee Pilot Cabinet Secre
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 22, 2022 | 9:56 AM

Trainee Pilot Cabinet Secretariat: కేబినేట్‌ సెక్రటేరియట్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వానికి చెందిన కేబినేట్‌ సెక్రటేరియట్‌ గ్రూప్‌ ఏ గెజిటెడ్‌ విభాగంలో ట్రెయినీ పైలట్‌ పోస్టులను భర్తీ చేయనుంది. ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 06 ట్రెయినీ పైలట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణతో పాటు డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌/ హెలికాప్టర్‌ పైలట్‌ కమర్షియల్‌ లైసెన్స్‌ ఉండాలి.

* అభ్యర్థుల వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* దరఖాస్తులను పోస్ట్‌ బ్యాగ్‌ నెం. 3003, లోదీ రోడ్‌ హెడ్‌ పోస్టాఫీస్‌, న్యూఢిల్లీ 110003 అడ్రస్‌కు పంపించాలి.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 56,100తో పాటు ఇతర అలవెన్సులు అందిస్తారు.

* అభ్యర్థులను ఫ్లైట్‌ క్రూ లైసెన్స్‌ ఎగ్జామినేషన్; సైకోమెట్రిక్‌, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Radhe Shyam: రికార్డుల మోత మోగిస్తున్న రాధేశ్యామ్.. పదిరోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..

Home Loan: హోమ్ లోన్ త్వరగా చెల్లిస్తే వడ్డీ తగ్గుతుందా? పూర్తి వివరాలు..

Stock Market: స్టాక్స్ కొనేటప్పుడు ఇన్వెస్టర్లు ఎలాంటి ఛార్జీలు చెల్లించాలి.. పూర్తి వివరాలు..