NMDC Recruitment: హైదరాబాద్ ఎన్‌ఎమ్‌డీసీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా.? రేపే చివరి తేదీ..
NMDC Recruitment: నేషనల్ మినరల్ డెవలప్‌ఎమంట్ కార్పొరేషన్ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థ గేట్ – 2021 స్కోర్ ఆధారంగా పలు పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు...
NMDC Recruitment: నేషనల్ మినరల్ డెవలప్‌ఎమంట్ కార్పొరేషన్ (NMDC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఈ సంస్థ గేట్ – 2021 స్కోర్ ఆధారంగా పలు పోస్టులను భర్తీ చేయనుంది. వివిధ విభాగాల్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు రేపటితో (23-03-2022) ముగియనున్న నేపథ్యంలో ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 29 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ఎలక్ట్రికల్ (6), మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ (9), మెకానికల్(10), మైనింగ్ (4) ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. గేట్–2021 వాలిడ్ స్కోర్ ఉండాలి.
* అభ్యర్థుల వయసు దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను మొదట గేట్-2021 మెరిట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. అనంతరం గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు మొదట నెలకు రూ. 50,000+ఇతర అలవెన్సులు అందజేస్తారు. విజయతంతంగా ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్న అంతనరం వారిని అసిస్టెంట్ మేనేజర్లుగా నియమిస్తారు. ఆ సమయంలో నెలకు రూ. 60,000 నుంచి రూ. 1,80,000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు రేపటితో (23-03-2022) ముగియనుంది.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Andhra Pradesh: పోలీసుల్లో వెల్లువిరిసిన మానవత్వం.. సగం కాలిన అనాథ శవాన్ని మోసుకెళ్లిన మహిళా ఎస్ఐ
Crude Oil: భారీగా పెరిగిన ముడి చమురు ధర.. మరి పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరుగుతాయా..?
Child Care Tips: వేసవిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినిపించండి..!