Child Care Tips: వేసవిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినిపించండి..!

Child Care Tips: వేసవి వచ్చిందంటే చాలు ప్రజలంతా హడలిపోతున్నారు. బయటకెళితే వడదెబ్బ బెడద.. ఇంట్లో కూర్చున్నా సరే డీహైడ్రేషన్ సమస్యలు,

Child Care Tips: వేసవిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పండ్లు తినిపించండి..!
Child Care
Follow us

|

Updated on: Mar 22, 2022 | 6:38 AM

Child Care Tips: వేసవి వచ్చిందంటే చాలు ప్రజలంతా హడలిపోతున్నారు. బయటకెళితే వడదెబ్బ బెడద.. ఇంట్లో కూర్చున్నా సరే డీహైడ్రేషన్ సమస్యలు, ఉక్కపోత బాధ, చెమట పొక్కులు, రకరకాల సమస్యలు వేధిస్తుంటాయి. ఇక చిన్న పిల్లల విషయానికి వచ్చేసరికి పరిస్థితి మరింత భయంకరంగా ఉంటుంది. అందుకే పిల్లల ఆరోగ్యంపై పేరెంట్స్ ఆందోళన చెందుతుంటారు. అయితే, వేసవి కాలంలో పిల్లల ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు చేస్తున్నారు. వారు తినే ఆహారంలో కొన్ని పండ్లను చేరిస్తే.. సీజనల్ సమస్యల నుంచి సేఫ్‌గా ఉండొచ్చంటున్నారు. అలాగే శరీరంలో శక్తి ఉంటుందని చెబుతున్నారు. మరి పిల్లలు వేసవి కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటిపండు.. అరటిలో అనేక పోషకాలు ఉంటాయి. దీనిని మీ పిల్లలకు రోజూ తినిపించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే పోషకాలు.. పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉండేందుకు దోహదపడుతాయి.

కొబ్బరి నీరు.. అనేక పోషకాలతో పాటు, ఎలక్ట్రోలైట్స్ కూడా కొబ్బరి నీళ్లలో పుష్కలంగా ఉంటాయి. కొబ్బరి నీళ్ల రుచి బాగుంటుంది కాబట్టి.. పిల్లలు కూడా దీనిని ఇష్టపడి తాగుతారు. వేసవి కాలంలో పిల్లలకు రోజూ కొబ్బరి నీళ్లు తాపించండి. దీని వల్ల వారి శరీరం హైడ్రేట్‌గా ఉండి.. ఆరోగ్యంగా ఉంటారు.

మామిడి.. వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండు పేరు మోత మోగిపోతది. ఆరోగ్యం విషయంలో మామిడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఎంత రుచికరమైనదో.. అంతే ఆరోగ్యకరమైనది కూడా. ఇందులో విటమిన్ ఏ, సీ, డీ, ఐరన్, పొటాషియం వంటి ఇతర పోషకాలు పుష్కలంగా ఉననాయి. అయితే, పిల్లలకు మామిడి పండ్లు తినిపించే ముందు.. రెండు గంటల పాటు వాటిని నీటిలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

బొప్పాయి.. వేసవిలో మలబద్ధకం సమస్య పిల్లలను వేధిస్తుంటుంది. ఇలాంటి సమస్యలను తొలగించడంలో బొప్పాయి అద్భుతంగా పని చేస్తుంది. పిల్లలకు రోజూ కొంత బొప్పాయి పండును తినిపిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరిగి, వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. పెద్దలు కూడా దీనిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.

స్ట్రాబెర్రీ.. వేసవి కాలంలో పిల్లలు శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే స్ట్రాబెర్రీలను తినిపించండి. లేదా వాటితో చేసిన పదార్థాలైనా తినిపించండి. స్ట్రాబెరీతో చేసిన షేక్ ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే, పిల్లలకు దీనిని పరిమితంగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also read:

Health care ideas: ఇవి తిన్నా, తాగినా క్యాన్సర్ బారిన పడటం ఖాయం.. అవేంటో ఇప్పుడే తెలుసుకోండి..!

Russia Ukraine War: ఇది కదా దేశ భక్తి అంటే.. క్లిష్ట సమయంలో సైనికులకు అధ్బుతమైన ప్రేరణ ఇస్తున్న ఉక్రేయిన్ ప్రజలు..

AP Weather Alert: ముంచుకొస్తున్న ‘అసాని’.. ఆ జిల్లాలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం..!