Work From Home: ఉద్యోగానికి రాజీనామా అయినా చేస్తాం, ఆఫీసులకు మాత్రం రాలేము.. సర్వేలో ఆసక్తికర విషయాలు..
Work From Home: కరోనా (Corona) మహమ్మారి ప్రజల జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా ఉద్యోగ శైలి కూడా మారిపోయింది. అంతకు ముందు ఎప్పుడూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని..
Work From Home: కరోనా (Corona) మహమ్మారి ప్రజల జీవితాలను ఎంతలా ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. కరోనా కారణంగా ఉద్యోగ శైలి కూడా మారిపోయింది. అంతకు ముందు ఎప్పుడూ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అవలంభించని కంపెనీలు సైతం అనివార్యంగా ఈ విధానాన్ని ఫాలో కావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో పట్టణాల్లో ఉన్న చాలా మంది ఉద్యోగులు సొంతూరు బాట పట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఉన్న సౌలభ్యాన్ని గుర్తించిన ఉద్యోగులు ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ పని చేస్తున్నారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కరోనా థార్డ్ వేవ్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులను తిరిగి కార్యాలయాలకు రప్పించే పనిలో పడ్డాయి. ఇప్పటికే మేనేజర్ లెవల్‌లో ఉన్న ఉద్యోగులను ఆఫీసులకు పిలిపిస్తున్నారు.
వాలంటీర్‌గా ఆఫీస్‌కు వచ్చే వారికి ఆహ్వానం అందిస్తున్నారు. అయితే ఇన్ని రోజులు ఇంటి నుంచి పని చేయడానికి అలవాటు పడ్డ ఉద్యోగులు మాత్రం తిరిగి ఆఫీసులకి రావడానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. జీతాలు పెంపు కంటే వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక మరికొందరైతే ఉద్యోగాన్ని వదులు కోవడానికి కూడా సిద్ధం అంటున్నారు కానీ.. ఆఫీసుకి తిరిగి వచ్చేది లేదంటూ తేల్చి చెబుతున్నారు. తాజాగా ప్రముఖ రిక్రూట్‌మెంట్ సంస్థ CIEL HR సర్వీసెస్ నిర్వహించిన ఓ సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
ప్రతీ 10 మంది ఉద్యోగుల్లో 6గురు ఆఫీసుకి రావడం కంటే రాజీనామా చేయడానికే సిద్ధంగా ఉన్నారని సమాధానం ఇచ్చారు. ఐటీ, ఔర్స్ సోర్సింగ్, టెక్ స్టార్టప్‌లు, కన్సల్టింగ్‌కు చెందిన వారు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కంపెనీలు మాత్రం ఉద్యోగులను ఆఫీసుకి రప్పించడానికే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే హైబ్రిడ్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. 25 శాతం మంది ఆఫీసులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇక మరికొన్ని కంపెనీలు అయితే పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ విధానానికి జై కొడుతున్నాయి.
Also Read: Mukesh Ambani: అంబానీ చేతికి మరో కంపెనీ.. డీల్ వ్యాల్యూ ఎంతంటే..
IPL 2022: జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ ఇప్పుడు లక్నో జట్టులో కీలకం.. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు..!
AP Weather Alert: ముంచుకొస్తున్న ‘అసాని’.. ఆ జిల్లాలపై ఎక్కువ ఎఫెక్ట్ ఉండే అవకాశం..!