AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022: జింబాబ్వే ఫాస్ట్‌ బౌలర్ ఇప్పుడు లక్నో జట్టులో కీలకం.. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు..!

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ఆటగాళ్లు

IPL 2022: జింబాబ్వే ఫాస్ట్‌ బౌలర్ ఇప్పుడు లక్నో జట్టులో కీలకం.. 140 కిలోమీటర్ల వేగంతో బంతులు..!
Blessing Muzarabani
uppula Raju
|

Updated on: Mar 22, 2022 | 5:46 AM

Share

IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్‌ అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ఆటగాళ్లు ఈ లీగ్‌లో ఆడాలని ఆకాంక్షించారు. కానీ కొంతమందికి కుదరలేదు. అలాగే చాలా పెద్ద దేశాల ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు కానీ చిన్న దేశాల ఆటగాళ్లకు అవకాశం లభించలేదు. అయితే జింబాబ్వేకు చెందిన ఓ ఆటగాడు ఈసారి ఐపీఎల్‌లో తన సత్తా చాటనున్నాడు. ఈ ఆటగాడి పేరు బ్లెస్సింగ్ ముజర్బానీ. ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్‌ తరుపున ఆడనున్నాడు. ముజర్బానీ భారతదేశానికి బయలుదేరాడు. జింబాబ్వేలోని భారత రాయబారి ముజర్బానీని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. లక్నో సూపర్‌జెయింట్‌ల బృందానికి రాయబారి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ముజర్బానీ ప్రస్తుతం జింబాబ్వేలోని ప్రతిభావంతులైన ఆటగాళ్లలో ఒకరు. పాకిస్థాన్, ఇంగ్లండ్‌లో తన ప్రతిభను ప్రదర్శించాడు. అతను పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొన్నాడు. పిఎస్‌ఎల్‌లో అతను నాలుగు మ్యాచ్‌లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. అతను ఇంగ్లాండ్‌లో కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. 140 కి.మీ వేగంతో బౌలింగ్ చేయగల సత్తా అతనికి ఉంది.

ఇప్పటి వరకు అతడి కెరీర్‌ను పరిశీలిస్తే తన దేశం తరఫున 21 టీ20 మ్యాచ్‌లు ఆడి 25 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో అతను ODIల్లో తన దేశం కోసం 30 మ్యాచ్‌లు ఆడి 39 వికెట్లు తీశాడు.ముజర్బానీ ఆరు టెస్ట్ మ్యాచ్‌లలో జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 19 వికెట్లు తీసుకున్నాడు. లక్నో ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్‌ను రూ.7.5 కోట్లకు తీసుకుంది. అయితే అతను గాయం కారణంగా ఈ సీజన్‌లో ఆడటంలేదు. అతని భర్తీ కోసం జట్టు వెతుకుతోంది. ఈ పరిస్థితిలో ముజర్బానీ వారి ఎంపిక అయి ఉండొచ్చు. దాదాపు ఇద్దరి స్పీడు ఒకటే. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఆడుతున్న చాలా మంది ఆటగాళ్లు ముజ్రాబానీ బంతులను ఎదుర్కోలేదు. కాబట్టి ముజర్బానీ విజయవంతమవుతాడని అందరు ఆశిస్తు్న్నారు.

Strangest Buildings: అలా ఎలా నిర్మించారబ్బా.. వింతైన కట్టడాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

Relationship: ఆ సమయంలో మహిళలకి, పురుషలకి ఉన్న తేడా అదే..!

Viral Video: డ్యాన్స్‌ అంటే ఇలా ఉండాలి.. పరేషాన్ అవుతున్న నెటిజన్లు..!