Watch Video: ఇలా బాదితే మరోసారి ట్రోఫీ మీదే.. బేబీ డివిలియర్స్, పొలార్డ్ బ్యాటింగ్‌కు నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో
ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు బేబీ డివిలియర్స్‌ను కొనుగోలు చేసింది. అదే సమయంలో, పొలార్డ్‌ను రూ.6 కోట్లకు ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో సందడి నెలకొంది. ప్రస్తుతం టోర్నీ ప్రారంభానికి వారం కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని జట్లు ఇందుకోసం ప్రాక్టీస్ ప్రారంభించాయి. ముంబై ఇండియన్స్ జట్టు కూడా మరోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ఈసారి టోర్నీలో ఎనిమిది జట్లు కాకుండా 10 జట్లు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో లీగ్ మరింత ఉత్కంఠగా సాగుతుందని భావిస్తున్నారు. ముంబై ఇండియన్స్ టీమ్ ప్రాక్టీస్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో ఆ జట్టు దిగ్గజ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్, ‘బేబీ డివిలియర్స్’గా పేరుగాంచిన డెవాల్డ్ బ్రెవిస్ భారీ షాట్‌లు ఆడుతూ కనిపిస్తున్నారు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో ముంబై ఇండియన్స్ రూ. 3 కోట్లకు బేబీ డివిలియర్స్‌ను కొనుగోలు చేసింది. అదే సమయంలో, పొలార్డ్‌ను రూ. 6 కోట్లకు ఫ్రాంచైజీ తన వద్ద ఉంచుకుంది.
Exquisite shots, yorkers and class! ?
?️ Sit back and enjoy a minute long ? net session featuring Polly, Boom and Brevis! ?#OneFamily #MumbaiIndians @KieronPollard55 @Jaspritbumrah93 MI TV pic.twitter.com/X0vz7qbHNx
— Mumbai Indians (@mipaltan) March 21, 2022
ముంబై ఇండియన్స్ పూర్తి జట్టు – డెవాల్డ్ బ్రెవిస్ (రూ. 3 కోట్లు), ఇషాన్ కిషన్ (రూ. 15.25 కోట్లు), మురుగన్ అశ్విన్ (రూ.1.60 కోట్లు), బాసిల్ థంపి (రూ.30 లక్షలు), జయదేవ్ ఉనద్కత్ (రూ.75 లక్షలు), మయాంక్ మార్కండేయ (రూ. 65 లక్షలు) , సంజయ్ యాదవ్ (రూ.50 లక్షలు), తిలక్ వర్మ (రూ.1.70 కోట్లు), డేనియల్ సామ్స్ (రూ.2.60 కోట్లు), టైమల్ మిల్స్ (రూ.1.50 కోట్లు), జోఫ్రా ఆర్చర్ (రూ.8 కోట్లు), రిలే మెరెడిత్ (రూ.1 కోటి), టిమ్ డేవిడ్ (రూ.8.25 కోట్లు) కోట్లు ), మహ్మద్ అర్షద్ ఖాన్ రూ.(20 లక్షలు), ఆర్యన్ జుయల్ (రూ.20 లక్షలు), అర్జున్ టెండూల్కర్ (రూ.30 లక్షలు), ఫాబియన్ అలెన్ (రూ.75 లక్షలు), అన్మోల్‌ప్రీత్ సింగ్ (రూ.20 లక్షలు), రమణదీప్ సింగ్ (రూ.20 లక్షలు), రాహుల్ (రూ.20 లక్షలు) ) మరియు హృతిక్ (రూ.20 లక్షలు), రోహిత్ శర్మ (రూ.16 కోట్లు), జస్ప్రీత్ బుమ్రా (రూ.12 కోట్లు), సూర్యకుమార్ యాదవ్ (రూ.8 కోట్లు), కీరన్ పొలార్డ్ (రూ.6 కోట్లు)
ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూల్- (లీగ్ స్టేజ్)
1- మార్చి 27 vs ఢిల్లీ క్యాపిటల్స్, బ్రబౌర్న్ స్టేడియం, ముంబై
2- ఏప్రిల్ 2 vs రాజస్థాన్ రాయల్స్, DY పాటిల్ స్టేడియం, ముంబై
3- ఏప్రిల్ 6 vs కోల్‌కతా నైట్ రైడర్స్, MCA స్టేడియం, పూణే
4- ఏప్రిల్ 4-9 vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, MCA స్టేడియం, పూణే
5- ఏప్రిల్ 13 vs పంజాబ్ కింగ్స్, MCA స్టేడియం, పూణే
6- ఏప్రిల్ 16 vs లక్నో సూపర్ జెయింట్స్, బ్రబౌర్న్ స్టేడియం, ముంబై
7- ఏప్రిల్ 21 vs చెన్నై సూపర్ కింగ్స్, DY పాటిల్ స్టేడియం, ముంబై
8- ఏప్రిల్ 24 vs లక్నో సూపర్ జెయింట్స్, వాంఖడే స్టేడియం, ముంబై
9- 30 ఏప్రిల్ v రాజస్థాన్ రాయల్స్, DY పాటిల్ స్టేడియం, ముంబై
10- 6 మే v గుజరాత్ టైటాన్స్, బ్రబౌర్న్ స్టేడియం, ముంబై
11-9 మే v కోల్‌కతా నైట్ రైడర్స్, DY పాటిల్ స్టేడియం, ముంబై
12- మే 12 Vs చెన్నై సూపర్ కింగ్స్, వాంఖడే స్టేడియం, ముంబై
13- 17 మే Vs సన్‌రైజర్స్ హైదరాబాద్, వాంఖడే స్టేడియం, ముంబై
14- 21 మే Vs ఢిల్లీ క్యాపిటల్స్, వాంఖడే స్టేడియం, ముంబై.
IPL 2022: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టింది వీరే.. టాప్ 5లో ఎవరున్నారంటే?