- Telugu News Photo Gallery Cricket photos IPL 2022: most wicket takers in ipl history lasith malinga top place in indian premier league
IPL 2022: ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టింది వీరే.. టాప్ 5లో ఎవరున్నారంటే?
IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. దాని కంటే ముందు ప్రతి అభిమాని తెలుసుకోవలసిన ముఖ్యమైన కొన్ని గణాంకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ..
Updated on: Mar 21, 2022 | 8:15 PM

IPL 2022 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. దాని కంటే ముందు ప్రతి అభిమాని తెలుసుకోవలసిన ముఖ్యమైన కొన్ని గణాంకాలు ఉన్నాయి. టీ20 క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించినప్పటికీ, బౌలర్లు కూడా తమదైన ఆటతో ఆకట్టుకున్నారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరు? టాప్ 5 లిస్టులో ఎవరున్నారో తెలుసుకుందాం.

ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 170 వికెట్లు తీసిన ఆటగాడు లసిత్ మలింగ. మలింగ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చినా ఈ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. మలింగ ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 7.14 పరుగులు మాత్రమే.

అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో డ్వేన్ బ్రావో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో బ్రావో 167 వికెట్లు తీశాడు. ఈ సీజన్‌లో మలింగ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ ఉంది.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో అమిత్ మిశ్రా మూడో స్థానంలో ఉన్నాడు. మిశ్రా 154 మ్యాచ్‌ల్లో 166 వికెట్లు తీశాడు. మిశ్రా ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కూడా తీశాడు.

157 వికెట్లతో పీయూష్ చావ్లా నాలుగో స్థానంలో ఉన్నాడు. చావ్లా 7.88 ఎకానమీ రేటుతో పరుగులు వెచ్చించాడు.

హర్భజన్ సింగ్: 163 మ్యాచుల్లో 150 వికెట్లతో హర్భజన్ సింగ్ ఐదోస్థానంలో నిలిచాడు. 7.07 ఎకానమీ రేటుతో పరుగులు ఇచ్చాడు.




