Kendriya Vidyalaya: ఇకపై కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోట కట్..? కేంద్ర విద్యాశాఖ సంచలన నిర్ణయం.?
Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో అంత సులభంగా సీటు లభించదనే విషయం తెలిసిందే. ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలకు సీట్లు కేటాయించిన తర్వాత మిగతా సీట్లను సాధారణంగా అయితే డ్రా విధానంలో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అలాగే ఎంపీ కోటా కూడా ఉంటుంది...
Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో అంత సులభంగా సీటు లభించదనే విషయం తెలిసిందే. ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగుల పిల్లలకు సీట్లు కేటాయించిన తర్వాత మిగతా సీట్లను సాధారణంగా అయితే డ్రా విధానంలో విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. అలాగే ఎంపీ కోటా కూడా ఉంటుంది. ఒక్కో విద్యా సంవత్సరంలో 10 మంది వరకు విద్యార్థులకు ఎంపీ సిఫారసు చేసే అవకాశం ఉంది.
ఒక్కో విద్యాసంవత్సరంలో ఎంపీకి పది మందిని సిఫారసు చేసే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎంపీ కోటాను తొలగించనున్నారా.? అంటే తాజాగా సోమవారం లోక్‌సభలో జరిగిని చర్చ చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. కేంద్రీయ పాఠశాలల్లో అడ్మిషన్లకు భారీగా విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో 10 సీట్ల కోటా సరిపోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ పేర్కొన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎంపీల కోటా పెంచాలనీ, లేదంటే కోటాను తొలగించాలని స్పీకర్ ఓంబిర్లా దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోటా తొలగింపునకు సభ ఏకగ్రీవంగా నిర్ణయిస్తే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను చాలా మంది ఎంపీలు వ్యతిరేకించారు. మరి కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
Also Read: Penny Stock: ఏడాదిలో 2330% పైగా పెరిగిన పెన్నీ స్టాక్.. ఇన్వెస్టర్ల విలువను ఎంత పెంచిందంటే..
Radhe Shyam: రికార్డుల మోత మోగిస్తున్న రాధేశ్యామ్.. పదిరోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..