Penny Stock: ఏడాదిలో 2330% పైగా పెరిగిన పెన్నీ స్టాక్.. ఇన్వెస్టర్ల విలువను ఎంత పెంచిందంటే..
Penny Stock: పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లు ఊహించని స్థాయిలో అమాంతం పెరిగి రిటర్న్స్ ఇస్తుంటాయి. వీటిలో లాభాలు ఎలా ఉంటాయో తేడా వస్తే నష్టాలు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయి.
Penny Stock: పెన్నీ స్టాక్స్ ఇన్వెస్టర్లు ఊహించని స్థాయిలో అమాంతం పెరిగి రిటర్న్స్ ఇస్తుంటాయి. వీటిలో లాభాలు ఎలా ఉంటాయో తేడా వస్తే నష్టాలు కూడా ఊహించని స్థాయిలో ఉంటాయి. ఎల్ఈడీ స్కీన్స్ తయారీలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్స్ కంపెనీ పెన్నీ షేర్ గడచిన ఏడాది కాలంలో తన పెట్టుబడి దారులకు మంచి లాభాలను అందించింది. మార్చి 2021 లో రూ. 0.90 గా ఉన్న MIC Electronics షేర్ విలువ.. ప్రస్తుతం రూ.21కి చేరింది. అంటే ఈ కాలంలో షేర్ విలువ అమాంతం 2331 శాతం మేర పెరుగుదలను నమోదు చేసింది. సంవత్సరం కిందట ఈ షేర్ లో రూ. లక్ష పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల విలువ ప్రస్తుతం రూ.24.31 లక్షలకు చేరుకుంది. ఈ షేర్ 2331 శాతం పెరిగిన సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 15 శాతం రిటర్న్ అందించింది.
ప్రస్తుతం కంపెనీ మార్కెట్ విలువ రూ. 116 కోట్లుగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ రూ. 7.14 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. గతంలో ఈ లాభం 2.23 కోట్లుగా ఉంది. అంటే లాభాల్లో 420 శాతం వృద్ధిని కంపెనీ నమోదు చేసింది. ఇదే సమయంలో కంపెనీ సేల్స్ కూడా 44,850 శాతం పెరిగి.. రూ.26.97 కోట్లుగా నిలిచింది. ఎమ్ఐసీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ షేర్ 52 వారాల గరిష్ఠ విలువ రూ. 39 గా జనవరి 2022లో చేరింది. 2021 ఏప్రిల్ లో షేర్ విలువ తన 52 వారాల కనిష్ఠ స్థాయి అయిన రూ. 0.63 ని తాకింది.
NOTE: పెన్నీ స్టాక్స్ లో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్న అంశం. పైన ఇచ్చిన వివరాలు కేవలం సమాచారం అందించటం కోసం మాత్రమే ఇవ్వబడింది. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ ఆర్థిక సలహాదారుల సలహాలు తీసుకోండి.
ఇవీ చదవండి..
Market News: భారత మార్కెట్లు చతికిల పడ్డాయా..? వారం ప్రారంభం నుంచి మళ్లీ నష్టాల్లోకి...
Home Loan: హోం లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా ప్లాన్ చేసుకోండి..