AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Market News: భారత మార్కెట్లు చతికిల పడ్డాయా..? వారం ప్రారంభం నుంచి మళ్లీ నష్టాల్లోకి..

Market News: భారత స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే కీలక సూచీలు నెగటివ్ లోకి జారుకున్నాయి.

Market News: భారత మార్కెట్లు చతికిల పడ్డాయా..? వారం ప్రారంభం నుంచి మళ్లీ నష్టాల్లోకి..
Stock Market
Ayyappa Mamidi
|

Updated on: Mar 22, 2022 | 9:55 AM

Share

Market News: భారత స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ(Global Ques) పరిణామాల కారణంగా ఇవాళ ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే కీలక సూచీలు నెగటివ్ లోకి జారుకున్నాయి. బెంచ్ మార్క్ ఇండిసేస్(Indices) సెన్సెక్స్ 200 పాయింట్లను కోల్పోగా.. మరో సూచీ నిఫ్టీ 50 పాయింట్ల మేర పతనమైంది. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 325 పాయింట్ల మేర నష్టపోయింది. మిడ్ క్యాప్ సూచీ సైతం 175 పాయింట్ల వరకు నష్టాల్లో ఉదయం 9.30 సమయానికి ట్రేడ్ అవుతున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరానికి ఫిచ్ రేటింగ్ సంస్థ భారత జీడీపీ అంచనాలను భారీగా తగ్గించటం కూడా మార్కెట్ల ఒడిదొడుకులకు మరో కారణమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

జీడీపీ అంచానాలు తగ్గుదల..

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత GDP వృద్ధి అంచనాను ఫిచ్ రేటింగ్స్ భారీగా 180 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. GDP వృద్ధి అంచనాలను  8.5 శాతానికి తగ్గించింది. అయితే FY22కి రేటింగ్స్ ఏజెన్సీ తన అంచనాలను.. డిసెంబర్ అంచనా కంటే 60 బేసిస్ పాయింట్లను పెంచింది. FY22 GDP వృద్ధి అంచనాలో పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థ కరోనా మూడో వేర్ ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ తో స్వల్పంగా నష్టం కలగటం వల్ల జరిగిందని Fitch తన నివేదికలో తెలిపింది.

ONGC 3.88%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.25%, టాటా స్టీల్ 1.09%, టీసీఎస్ 0.96%, సన్ ఫార్మా 0.76%, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 0.63%, కోల్ ఇండియా 0.55%, లుపిన్ 0.36%, ఎన్టీపీసీ 0.26% నిఫ్టీ సూచీలో కంపెనీల షేర్లు ఆరంభంలో గాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇదే సమయంలో హిందుస్థాన్ యూనీలివర్ 2.47%, యాక్సిస్ బ్యాంక్ 2.09%, ఏషియన్ పెయింట్స్ 1.95%, మహీంద్రా అండ్ మహీంద్రా 1.39%, హీరో మోటో కార్ప్ 1.16%, ఎస్బీఐ 0.90%, టాటా మోటార్స్ 0.77% తమ షేర్ విలువను కోల్పోయి ఆరంభంలో టాప్ లూజర్స్ గా నిలిచాయి.

ఇవీ చదవండి..

SBI Alert: SBI ఖాతాదారులకు శుభవార్త.. ఆ ఖాతా కలిగి ఉన్న వారికి రూ. 2 లక్షల ఉచిత ఇన్సూరెన్స్..

Home Loan: హోమ్ లోన్ త్వరగా చెల్లిస్తే వడ్డీ తగ్గుతుందా? పూర్తి వివరాలు..

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?