AFMS Recruitment 2022: ఆర్మీకి చెందిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 420 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా ఎంపిక..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS).. 420 మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medial Officer posts) భర్తీకి (పురుషులు-378, మహిళలు-42) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

AFMS Recruitment 2022: ఆర్మీకి చెందిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్‌లో 420 ఉద్యోగాలు.. రాత పరీక్షలేకుండా నేరుగా ఎంపిక..
Afms
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 21, 2022 | 4:18 PM

AFMS Medial Officer Recruitment 2022: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ (AFMS).. 420 మెడికల్ ఆఫీసర్ పోస్టుల (Medial Officer posts) భర్తీకి (పురుషులు-378, మహిళలు-42) అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంబీబీఎస్‌తోపాటు సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. స్టేట్‌ మెడికల్ బోర్డు లేదా NBE/NMCలో రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు డిసెండర్‌ 31, 2022వ తేదీ నాటికి 35 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు సెప్టెంబర్‌ 18, 2022వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.200లు చొప్పున ప్రతి ఒక్కరు చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్ధులను ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్‌, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన వారికి సెప్టెంబర్‌ 27వ తేదీ నుంచి కింది అడ్రస్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్‌: Army Hospital (R&R), Delhi Cantt.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.