APRJC and APRDC 2024 Results: ఏపీఆర్ జేసీ, ఏపీఆర్ డీసీ, గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింగ్ ఇదే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్, ఏపీఆర్‌ఐసీ సొసైటీ సెక్రటరీ నరసింహారావు ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్25న ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్ డీసీ రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను..
అమరావతి, మే 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెసిడెన్షియల్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ప్రవేశాలకు నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్‌కుమార్, ఏపీఆర్‌ఐసీ సొసైటీ సెక్రటరీ నరసింహారావు ఫలితాలను విడుదల చేశారు. ఏప్రిల్25న ఈ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీఆర్‌జేసీ, ఏపీఆర్ డీసీ రెండు ప్రవేశ పరీక్షల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ప్రవేశ పరీక్షల్లో వచ్చిన మార్కులు, రిజర్వేషన్, స్థానికత ఆధారంగా ఆయా రెసిడెన్షియల్, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. అధికారిక వెబ్‌సైట్లో విద్యార్థులు తమ క్యాండిడేట్‌ఐడీ, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, ఫలితాలను తెలుసుకోవచ్చు. ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంటర్ ఫస్టియర్‌లో ఆయా గురుకులాల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఈఈటీ, సీజీటీ గ్రూపుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే APRDC పరీక్షలో అర్హత సాధించిన వారికి డిగ్రీ ఫస్ట్ ఇయర్‌లో డిగ్రీ గురుకుల కాలేజీల్లో పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే ఏపీ ఆర్‌ఎస్ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఐదో తరగతిలో అడ్మిషన్లు ఇస్తారు. ఐదో తరగతితోపాటు 6,7,8 తరగతుల్లో మిగిలివున్న సీట్లను కూడా భర్తీ చేస్తారు. ఏపీ ఆర్‌ఎస్ 2024 ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
రాష్ట్రంలోని రెసిడెన్సియల్ పాఠశాలల్లో 5 నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు నిర్వహించిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25,216 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు అత్యధికంగా 49,308 మంది హాజరయ్యారు. నాగార్జునసాగర్ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షకు 963 మంది విద్యార్థులు హాజరైనట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు. ఏపీఆర్ డీసీ 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.