APPSC JL 2025 Exam Date: ఏపీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఇంతకీ ఎప్పట్నుంచంటే?
పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ జూనియర్, డిగ్రీ లెక్చరర్ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. 2023 నోటిఫికేషన్లు జారీ చేసినప్పటికీ అప్పటి నుంచి అతీగతీ లేకుండా ఉన్న నియామక ప్రక్రియను కూటమి సర్కార్ ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నియామక పరీక్షలు నిర్వహించేందుకు..

అమరావతి, మార్చి 24: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ జూనియర్, డిగ్రీ లెక్చరర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు 2023లో నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పరీక్షలను జూన్ 16, 2025 నుంచి జూన్ 26, 2025 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు, టీటీడీ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, టీటీడీ ఓరియంటల్ కాలేజీల్లో, టీటీడీ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఈ రాత పరీక్షలు జరగనున్నాయి.
ఇండియా పోస్ట్ జీడీఎస్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిళ్లలో దాదాపు 21,413 గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) పోస్టులకు సంబంధించిన ఫలితాలను తపాలా శాఖ తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు అభ్యర్థుల మెరిట్ జాబితాను ఇండియా పోస్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటించింది. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ నియామకాలు చేపట్టినట్లు ప్రకటించింది. ఎంపికైనవారు బ్రాంచ్‌పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం), డాక్ సేవక్ హోదాలతో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1215, తెలంగాణలో 519 వరకు ఖాళీలు ఉన్నాయి.
ఇండియా పోస్ట్ జీడీఎస్ 2025 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.