Lineman Jobs In AndhraPradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లైన్‌మెన్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. జీతం రూ. 15 వేలు..

Lineman Jobs In AndhraPradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APCPDCL) లైన్‌మెన్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది...

Lineman Jobs In AndhraPradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో లైన్‌మెన్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్.. జీతం రూ. 15 వేలు..
Linemen Jobs In Ap
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 22, 2021 | 12:47 PM

Lineman Jobs In AndhraPradesh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఉన్న నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (APCPDCL) లైన్‌మెన్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా నాలుగు జిల్లాల ప‌రిధిలో మొత్తం 86 ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ ఖాళీల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు 31.01.2021 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి అదే విధంగా 35 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.

ముఖ్య‌మైన విష‌యాలు..

* ఈ పోస్టుల‌కు దర‌ఖాస్తు చేసుకోవాల‌నుకునే వారు ఐ.టి.ఐ ఎలక్ట్రికల్ లేదా వైర్ మెన్ సర్టిఫికెటర్ లేదా, ఇంటర్ ఓకేషల్ ఎలక్ట్రికల్ ట్రేడ్ అర్హ‌త పొంది ఉండాలి.

* అర్హ‌త, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.

* ద‌ర‌ఖాస్తుల‌కు 07-04-2021 ప్రారంభ తేదీ.

* చివ‌రి తేదీ 03-05-2021

* ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు.. ఎస్సీ/ఎ‌స్టీలు రూ. 350 చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ/బీసీలు రూ. 700 చెల్లించాలి.

* ప‌రీక్ష తేదీ 23-05-2021

* ఎంపికైన అభ్య‌ర్థులకు రెండేళ్ల పాటు రూ. 15000 జీతంగా అందిస్తారు.

* పూర్తి నోటిఫికేష‌న్ కోసం  ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. ఎస్‌బీఐలో 86 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌… దరఖాస్తు గడువు మే 3 వరకు

TSPSC Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త… ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

Ramesh Pokhriyal: నాయకుల్లో కరోనా టెన్షన్.. కేంద్ర విద్యాశాఖ మంత్రి పోఖ్రియాల్‌కు పాజిటివ్..