KVS Admission 2021: కరోనా కలకలం.. కేంద్రీయ విద్యాలయాల అడ్మిషన్ ప్రక్రియ వాయిదా.. వివరాలు..
KVS class 1 admission list 2021: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే సీబీఎస్ఈ బోర్డు
KVS class 1 admission list 2021: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలనే సీబీఎస్ఈ బోర్డు పది పరీక్షలను రద్దు చేశారు. 12వ తరగతి, యూజీసీ నెట్, తదితర పరీక్షలను వాయిదా వేశారు. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించిన మొదటి జాబితా విడుదల ప్రక్రియ కూడా వాయిదా పడింది. వాస్తవానికి కేంద్రీయ విద్యాలయ షెడ్యూల్ ప్రకారం.. మొదటి జాబితాను ఈనెల 23న విడుదల చేయాల్సి ఉంది. అయితే దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం వేలల్లో కేసులు పెరగుతున్నాయి. తాజాగా మూడు లక్షల కేసులు నమోదయ్యాయి.
దీంతో కేవీఎస్ మొదటి జాబితా విడుదలను వాయిదావేసినట్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) ప్రకటించింది. జాబితాను ఎప్పుడు ప్రకటిస్తామనే విషయాన్ని అధికారిక వెబ్‌సైట్ kvsonlineadmission.kvs.gov.in. లో ప్రకటిస్తామని కేవీఎస్ వెల్లడించింది. వచ్చే విద్యాసంవత్సరానికి సంబధించి ఒకటో తరగతి ప్రశాల దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 19న ముగిసింది. మొదటి జాబితాను శుక్రవారం విడుదల చేసిన తర్వాత.. ఏప్రిల్ 30న రెండు, మూడోజాబితాను విడుదల చేస్తామని కేవీఎస్ ప్రకటించింది. అప్పటికీ సీట్లు మిగిలి ఉంటే.. మే 5న అడ్మిషన్ ప్రక్రియను చేపడతామని కేవీఎస్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ప్రక్రియను కేవీఎస్ ఆన్‌లైన్‌లోనే ప్రకటించింది.
Also Read: