AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: పుదుచ్చేరిలో దారుణం.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. అనంతరం మూటగట్టి..

student murder: పుదుచ్చేరిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని ప్రియుడే.. కడతేర్చారు. స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యచారం

Crime: పుదుచ్చేరిలో దారుణం.. ప్రియురాలిని చంపిన ప్రియుడు.. అనంతరం మూటగట్టి..
murder
Shaik Madar Saheb
|

Updated on: Apr 22, 2021 | 12:05 PM

Share

student murder: పుదుచ్చేరిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని ప్రియుడే.. కడతేర్చారు. స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యచారం చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె అడ్డుకోవడంతో దారుణంగా హత్యచేశారు. అనంతరం విద్యార్థిని మృతదేహాన్ని మూటగట్టి అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ సంఘటన పుదుచ్చేరి రాష్ట్రంలోని పుదుకుప్పంలో చోటుచేసుకుంది. బుధవారం అటవీ ప్రాంతంలో మృతదేహాం లభ్యమైందని పోలీసులు వెల్లడించారు. వివరాలు.. పుదుచ్చేరి సంత పుదుకుప్పంకు చెందిన రామన్‌ కుమార్తె ఓ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. కాగా మంగళవారం కళాశాలకు వెళుతున్నట్టు ఇంటో చెప్పి.. తన ప్రియుడు పృథ్విష్‌తో కలిసి బైకుపై వెళ్లింది. ఈ క్రమంలో పృథ్విష్‌ తన స్నేహితులతో కలిసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లారు. అనంతరం ఆ యువతిపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె ప్రతిఘటించింది. దీంతో పృథ్విష్ అతని స్నేహితులు యువతిని హత్య చేసి… మృతదేహాన్ని మూటగట్టి అటవీ ప్రాంతంలో పడేసి వెళ్లిపోయారు.

అనంతరం పృథ్విష్‌, తన స్నేహతులతో కలిసి నేరుగా అడ్వకేట్‌ వద్దకు వెళ్లి ముందస్తు బెయిల్‌ కోసం సంప్రదించాడు. అనంతరం ఈ హత్య కేసు వెలుగులోకి వచ్చింది. అడ్వకేట్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ముగ్గురు నిందితులు అక్కడ నుంచి పారిపోయారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు… మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read:

Earth Day 2021: సమస్త జీవకోటి భారాన్ని మోసేది పుడమి తల్లి.. నేడు ధరిత్రీ దినోత్సవం..

India Corona Cases: దేశంలో కరోనా విలయతాండవం.. ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో కేసులు.. మరణాలు..