AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Earth Day 2021: సమస్త జీవకోటి భారాన్ని మోసేది పుడమి తల్లి.. నేడు ధరిత్రీ దినోత్సవం..

Earth Day 2021: సమస్త జీవకోటి భారాన్ని మోసేది ఈ పుడమి తల్లి. ఇది అందరికి తెలిసిన .. ఇష్టానుసారంగా

Earth Day 2021: సమస్త జీవకోటి భారాన్ని మోసేది పుడమి తల్లి.. నేడు ధరిత్రీ దినోత్సవం..
Earth Day 2021
Rajitha Chanti
|

Updated on: Apr 22, 2021 | 9:28 AM

Share

Earth Day 2021: సమస్త జీవకోటి భారాన్ని మోసేది ఈ పుడమి తల్లి. ఇది అందరికి తెలిసిన .. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆ తల్లి దేహానికి గాయాలు చేస్తుంటారు. ఓ వైపు కాలుష్యం పెరుగుతున్నా.. అవేం పట్టించుకోకుండా.. మరో వైపు వనరులను తగ్గించేస్తూన్నారు. మనిషి అవసరాల కోసం జంతువులను చంపడం.. అడవులను నాశనం చేసి.. ఇప్పుడు కరోనా సృష్టిస్తున్న మారణ హోమంలో పడి కోట్టుమిట్టాడుతున్నాము. ఇష్టం వచ్చినట్లుగా సహజ వనరులను తగ్గించి.. ఇప్పుడు ప్రాణ వాయువు కోసం అల్లాడుతున్నారు. అభివృద్ధి పేరుతో జరిగే మితిమీరిన చేష్టలు భూమాతను నిలువునా దహించి వేస్తున్నాయి. తాగే నీరు.. పీల్చే గాలి.. నివసించే నేల… ఇలా పంచభూతాలు కాలుష్యంలో చిక్కుకున్నాయి. పచ్చదనంతో పరిఢవిల్లాల్సిన భూతల్లి ఎదపై ప్రకృతి అందాలను కోల్పోయి మూగ రోదనతో కన్నీరు కార్చుతోంది. మన భూమిని కాపాడుకుందాం అనే నినాదాలు కేవలం పుస్తకాల్లో రాతాలుగా మారిపోయాయి.

Earth Day

మనిషి స్వార్థపరుడు.. చెట్లను నరికేసి పక్షులకు గూళ్లు లేకుండా చేశాడు. అడవుల్ని మాయంచేసి జంతువులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాడు. అనాగరికులకు.. అడవుల్లో బ్రతికే వారు తమ చుట్టూ ఉన్న ప్రకృతితో జీవనం చేస్తుంటే.. అన్నీ తెలిసిన నాగరికుడు.. అభివృద్ధి, ప్రగతి పేరుతో పరిశ్రమలు స్థాపించి అడ్డూ అదుపూ లేకుండా ప్రకృతి వనరుల్నిదోచేస్తున్నాడు. నేల, నదులు, సముద్రాలు ఒకటేమిటి ఆఖరికి ఆకాశాన్ని సైతం తన అదుపులోనే ఉంచుకోవాలన్న అత్యాశతో మొత్తంగా భూమండలాన్ని కలుషితం చేశాడు. అలా తాను సృష్టించుకున్న కాలుష్యానికి ఇప్పుడు తానే బలవుతున్నాడు. మనిషి సాధించిన అభివృద్ధి ఏంటీ అని ప్రశ్నిస్తోంది కరోనా.. మనిషి తెలివితో.. సాధించిన అభివృద్ధితో తనను నాశనం చేయలేకపోతున్నాడని ఎగతాలిగా నవ్వుతూ… ఖాళీగా ఉండే స్మశానాలను రద్దీగా మార్చింది. చంద్రుడితోపాటు, ఇతర గ్రహాల పైకి వెళ్ళీ జీవనం సాగించడానికి వీలుందని తెలుసుకనేంత జ్ఞానం ఉన్న మనిషి.. కంటికి కనిపించని చిన్న వైరస్‏ను నాశనం చేయలేకపోవడమనేది.. ఇన్ని సంవత్సరాలుగా సాధించిన అభివృద్దిని వేలెత్తి చూపిస్తుంది.

పెరుగుట విరుగట కోరకే అన్ని సామెతను అక్షరాల నిజం చేసుకున్నాడు. అందనంత అభివృద్ధి సాధిస్తూ.. పుడమినే కాకుండా.. ఇతర గ్రహాలను కూడా వదలం అని విర్రవిగుతున్న మనిషికి కరోనా.. నీ సత్తా ఏమిటో చూపమని సవాలు విసిరింది. ఇప్పటికైనా మనిషి .. ఈ మహమ్మారి సృష్టిస్తున్న అల్లకల్లోలం గుర్తించి.. పుడమి తల్లితోపాటు పంచభూతాలను రక్షించుకొని.. మానవ మనుగడను ప్రశాంతంగా కొనసాగించేందుకు జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి.

World Earth Day

ఏప్రిల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది.. మిగతా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే. మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం.

1. వాహానాల వాడకం తగ్గిద్దాం. 2. అనవసర విద్యుత్ వాడకాన్ని తగ్గిద్దాం. 3. అడవులను నాశనం చేయకుండా.. చెట్లను పెంచడం అలవరచుకుందాం. 4. భూమికి హాని చేసే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేదిద్దాం.

మనిషి మనుగడకు నష్టం చేసిన కరోనా మాత్రం పుడమి తల్లికి మంచి చేస్తుందనే చెప్పుకోవాలి. మనిషి సృష్టించిన కాలుష్యం నుంచి ధరణి బయటపడేలా చేస్తుంది. మనిషిని నాలుగు గోడల మధ్య బందించి.. పక్షులూ జంతువులూ స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కల్పించింది. అలాగే వ్యర్థాలతో నిండిపోయిన నదులు మళ్లీ స్వచ్చంగా కనిపిస్తున్నాయి.

Also Read: Facebook: ఉద్యోగులకు షాక్ ఇవ్వనున్న ఫేస్‏బుక్.. ఆ ఎంప్లాయిస్ జీతాలను తగ్గించే యోచనలో సంస్థ..

SBI కస్టమర్లకు శుభవార్త… ఆ అకౌంట్ ఉంటే రూ. 2 లక్షలు మీ సొంతం.. అది ఎలానో తెలుసా..