TSPSC Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త… ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు

TSPSC Recruitment 2021: ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త అందింది. తెలంగాణ...

TSPSC Recruitment 2021: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త... ఆ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు గడువు పెంపు
Tspsc Recruitment
Follow us
Subhash Goud

|

Updated on: Apr 21, 2021 | 4:26 PM

TSPSC Recruitment 2021: ఈ మధ్య కాలంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త అందింది. తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) ఓ నోటిఫికేషన్‌ దరఖాస్తు గడువును పొడిగించింది. తెలంగాణలోని పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ కమ్‌ టైపిస్ట్‌, ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ మ్‌ టైపిస్ట్‌ పోస్టుల భర్తీకి గతంలోనే టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం అభ్యర్థులు మే 5 లోగా దరఖాస్తు చేయాలని వెల్లడించింది. అయితే ఇటీవల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతోపాటు విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు 10 శాతం ఎనకమికల్లీ వీకర్‌ సెక్షన్‌- రిజర్వేషన్‌ అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో టీఎస్‌పీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో మార్పుల చేయాల్సి వచ్చింది. దీంతో మరోసారి తాజాగా టీఎస్‌పీఎస్‌సీ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

తాజా నోటిఫికేషన్ ప్రకారం.. దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్‌ 19న ప్రారంభం అయ్యింది. దరఖాస్తు చేయడానికి 2021 మే 20వ తేదీ వరకు అవకాశం ఉంది. పోస్టుల సంఖ్యలో ఎలాంటి మార్పు లేదు. మొత్తం 127 ఖాళీలు ఉన్నాయి. గతంలో దరఖాస్తు చేసినవారు కూడా అప్లికేషన్‌ అప్‌డేట్‌ చేసి సబ్మిట్‌ చేయాల్సి ఉంటుంది.ఈ నోటిఫికేషన్‌ సంబంధించి పూర్తి వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్ చూడండి.

మొత్తం ఖాళీలు- 127

సీనియర్ అసిస్టెంట్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ- 15 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ- 10 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ- 102

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 19 దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ- 2021 మే 20 విద్యార్హతలు- డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పాస్ కావాలి. లేదా బీసీఏ డిగ్రీ పాస్ కావాలి. లేదా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పాస్ కావాలి. దీంతో పాటు టైప్‌రైటింగ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ పాస్ కావాలి.

వయస్సు- 18 నుంచి 34 ఏళ్లు పరీక్ష ఫీజు- రూ.200 ఎంపిక విధానం- రాతపరీక్ష పరీక్షా కేంద్రాలు- హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, ఆదిలాబాద్.

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.