AP SET 2024 Hall Tickets: ఏపీ సెట్‌ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2024 అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లోఏప్రిల్ 28వ తేదీన జరగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాట్లు..

AP SET 2024 Hall Tickets: ఏపీ సెట్‌ 2024 అడ్మిట్‌కార్డులు విడుదల.. పరీక్ష ఎప్పుడంటే!
AP SET 2024
Follow us

|

Updated on: Apr 22, 2024 | 8:32 AM

అమరావతి, ఏప్రిల్‌ 22: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2024 అడ్మిట్‌కార్డులు విడుదలయ్యాయి. సెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈమెయిల్‌ ఐడీ లేదా మొబైల్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసి అడ్మిట్‌కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లోఏప్రిల్ 28వ తేదీన జరగనుంది. ఈ మేరకు పరీక్ష నిర్వహణకు ఆంధ్ర యూనివర్సిటీ ఏర్పాట్లు చేస్తోంది.

కాగా రాష్ట్రంలోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, డిగ్రీలెక్చరర్లుగా ఉద్యోగం పొందాలంటే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సెట్)లో అర్హత పొందాల్సి ఉంటుంది. ఈ పరీక్షను ప్రతీ యేట రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. సెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్లకు జరుగుతుంది. మొదటి పేపర్‌లో జనరల్‌ స్టడీస్‌ 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌ 2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. మూడు గంటల వ్యవధిలో పరీక్ష జరుగుతుంది.

ఏపీ సెట్‌ 2024 అడ్మిట్‌ కార్డుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి. 

ఇవి కూడా చదవండి

సీయూఈటీ-యూజీ 2024 పరీక్ష తేదీల షెడ్యూల్‌ విడుదల

దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలు, ఇతర విద్యాసంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీయూఈటీ-యూజీ 2024 తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 261 కేంద్ర, రాష్ట్ర, ప్రైవేటు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఈ పరీక్షకు దాదాపు 13.4లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 63 సబ్జెక్టులకు ఏడు రోజుల్లో పరీక్షలు జరుగుతాయి. ఎక్కువగా దరఖాస్తులు వచ్చిన 15 సబ్జెక్టులకు ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మిగిలిన 48 సబ్జెక్టులకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. సీయూఈటీ-యూజీ 2024 పరీక్షలు మే 15 నుంచి 24వ తేదీ వరకు జరగనున్నాయి. కాగా గత ఏడాది ఈ పరీక్షలను 34 రోజుల పాటు 93 షిప్టుల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
ఏపీకి మోదీ రాక.. ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. పూర్తి షెడ్యూల్
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
స్వ్కాడ్‌లో ఛాన్స్..కట్‌చేస్తే.. 2 మ్యాచ్‌ల్లో 2 డకౌట్లు
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల పాటు వర్షాలు 
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే..
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..
'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..