AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

Srilakshmi C

|

Updated on: Apr 22, 2024 | 1:03 PM

AP 10th Class Results 2024 Live: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు గుడ్ న్యూస్.. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) సోమవారం (ఏప్రిల్‌ 2024) విడుదలయ్యాయి. విజయవాడలో ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ చేతుల మీదగా ఫలితాలు విడుదలయ్యాయి..

AP SSC Results 2024: ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ నేరుగా రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి
AP Class 10th Results

అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధుల నిరీక్షణకు మరి కొద్ది నిమిషాల్లో తెర పడనుంది. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు (AP SSC Results 2024) సోమవారం (ఏప్రిల్‌ 2024) విడుదల కానున్నాయి. విజయవాడలో ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ చేతుల మీదగా ఫలితాలు విడుదల చేయనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో ఔ మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరవగా.. 1.02 లక్షల మంది విద్యార్ధులు ప్రైవేటుగా పరీక్షలు రాశారు. ఫలితాల ప్రకటన అనంతరం టీవీ9 తెలుగు అధికారిక వెబ్‌సైట్‌లో ఒక్క క్లిక్‌తో నేరుగా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పరీక్షలు జరిగిన కేవలం 22 రోజుల్లోనే పదో తరగతి ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. ఎప్పుడూ మే నెలలో విడుదల చేసే టెన్త్‌ ఫలితాలు ఈ సారి కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇంటర్మీడియట్‌ ఫలితాలు విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Apr 2024 01:01 PM (IST)

    ఏపీ పదో తరగతి 2024 అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలివే

    మే 24 నుంచి జూన్‌ 3 వరకు పదో తరగతి అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. రేపట్నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. అప్లికేషన్లు ఆన్ లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.

  • 22 Apr 2024 12:52 PM (IST)

    ఉత్తీర్ణతలో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక ఉత్తీర్ణత.. ఢీలా పడిన ప్రైవేట్ స్కూల్స్!

    రాష్ట్రంలోని 12 రకాల మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ఉత్తీర్ణత శాతం ఇలా..

    • ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 98.43 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 98.43 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ ప్రైవేట్ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ 96.72 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ మోడల్‌ స్కూల్స్‌ 92.88 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ సోషల్ వెల్‌ఫేర్‌ స్కూల్స్‌ 94.56 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ ఆశ్రమ పాఠశాలలు 90.13 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ కస్తూర్బా బాలిక పాఠశాలలు 88.96 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ ట్రైబల్‌ వెల్‌ఫేర్‌ పాఠశాలలు 89.64 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ జిల్ల పరిషత్ హై స్కూల్స్‌ 73.38 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ ప్రైవెట్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ 80.01 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ మున్సిపల్‌ స్కూల్స్‌ 75.42 శాతం ఉత్తీర్ణత
    • ఏపీ గవర్నమెంట్ హై స్కూల్స్‌ 74.40 శాతం ఉత్తీర్ణత
  • 22 Apr 2024 12:20 PM (IST)

    టెన్త్‌ క్లాస్‌ స్టేట్ 1st టాపర్‌గా నిలిచిన ఏలూరు జిల్లాకు చెందిన ‘మనస్వి’

    పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లాకు చెందిన ఆకుల వెంటక నాగ సాయి మనస్వి 600 మార్కులకు గానూ 599 మార్కులు సాధించి ఏపీ రాష్ట్రంలోనే ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు.

  • 22 Apr 2024 11:58 AM (IST)

    పదో తరగతి ఫలితాల్లో ‘మీడియం’ వైజ్‌ ఫలితాలు ఇలా.. ‘హిందీ’ వంద శాతం భేష్

    • తెలుగు మీడియంలో 71.08 శాతం
    • ఇంగ్లిష్‌ మీడియంలో 92.32 శాతం
    • హిందీ మీడియంలో 100 శాతం (12 మంది రాశారు)
    • ఉర్దూ మీడియంలో 87.92 శాతం
    • కన్నడ మీడియంలో 56.84 శాతం
    • తమిళ మీడియంలో 94.62 శాతం
    • ఒడియా మీడియంలో 94.91 శాతం
  • 22 Apr 2024 11:55 AM (IST)

    ‘పది’ ఫలితాలు: సబ్జెక్ట్‌ వైజ్‌ ఉత్తీర్ణత శాతం ఇలా..

    ఈ రోజు విడుదలైన టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో సబ్జెక్ట్‌ వారీగా ఉత్తీర్ణత శాతం చూస్తే..

    • ఫస్ట్‌ ల్యాంగ్వేజ్‌లో 96.47 శాతం (తెలుగు)
    • సెకండ్ ల్యాంగ్వేజ్‌లో 99.24 శాతం (హిందీ)
    • థార్డ్‌ ల్యాంగ్వేజ్‌లో 98.52 శాతం (ఇంగ్లిష్‌)
    • మ్యాథమెటిక్స్‌లో 93.33 శాతం
    • జనరల్ సైన్స్‌లో 91.29 శాతం
    • సోషల్ స్టడీస్‌లో 95.34 శాతం
  • 22 Apr 2024 11:46 AM (IST)

    ఈసారి కూడా బాలికలదే పై చేయి.. 89.17 శాతం అధికం

    పదవ తరగతి ఫలితాలలో 86.69% ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు.. అత్యధిక ఉత్తీర్ణతతో బాలికలు పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,743 కేంద్రాలలో 6.16 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 5,34,574 విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. వీరిలో 84.02 శాతం బాలురు, 89.17 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు. బాలురు కంటే 4.85 శాతం బాలికలు అధికంగా ఉత్తీర్ణత పొంది పైచేయి సాధించారు.

  • 22 Apr 2024 11:44 AM (IST)

    ‘పది’ ఫలితాల్లో.. 2,803 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత

    రాష్ట్ర వ్యాప్తంగా 11,645 పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 2803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 17 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాలలో రాష్ట్రంలో మన్యం జిల్లా అగ్రస్థానంలో కర్నూలు జిల్లా 62.47శాతంతో ఆఖరి స్థానంలో నిలిచింది.

  • 22 Apr 2024 11:28 AM (IST)

    ఏపీ పదో తరగతి 2024 ఫలితాలను ఇక్కడ చెక్ చేసుకోండి..

  • 22 Apr 2024 11:28 AM (IST)

    సత్తా చాటిన ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్ విద్యార్ధులు.. అత్యధిక ఉత్తీర్ణత నమోదు

    ఈ రోజు విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్, బీసీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 98.43 శాతంతో అధికంగా ఉత్తీర్ణత సాధించాయి.

  • 22 Apr 2024 11:20 AM (IST)

    96.37 శాతం ఉత్తీర్ణతతో పార్వతీపురం మన్యం జిల్లా టాప్‌

    పార్వతీపురం మన్యం జిల్లాలో 96.37 శాతంతో అత్యంధిక శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో 62.47 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది.

  • 22 Apr 2024 11:18 AM (IST)

    పదో తరగతి ఫలితాల్లో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదు

    పరీక్షలకు హాజరైన మొత్తం 6.16.615 మందిలో 86.69 శాతం ఉత్తీర్ణత అంటే 5.34.574 మంది ఉత్తీర్ణత పొందారు. 11,645 పాఠశాలల నుంచి విద్యార్ధులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 2803 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత పొందారు. 17 స్కూల్స్‌లో మాత్రమే సున్నా ఉత్తీర్ణత నమోదైంది.

  • 22 Apr 2024 11:10 AM (IST)

    ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల

    ఏపీ ఎస్సెస్సీ డైరెక్టర్ దేవానంద రెడ్డి పదో తరగతి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది మొత్తం 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 84.02 శాతం బాలురు, 89.17 శాతం బాలికలు ఉత్తీర్ణత పొందారు.

  • 22 Apr 2024 11:03 AM (IST)

    లాస్ట్ వర్కింగ్‌ డేకు ముందుగానే తొలిసారి ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదల

    మొత్తం 6.16 వేల రెగ్యులర్‌ విద్యార్ధులు హాజరయ్యారు. ఈ ఏడాది ఒక్క విద్యార్ధి కూడా మాల్‌ ప్రాక్టీస్‌ జరగలేదు. 8 రోజుల్లో వాల్యుయేషన్‌ కంప్లీట్ చేశాం. టెన్త్‌ పరీక్షల చరిత్రలోనే లాస్ట్‌ వర్కింగ్‌ డేకు ముందుగానే తొలిసారి ఈ ఏడాది ఫలితాలు విడుదల చేస్తున్నాం అని అధికారులు అన్నారు.

  • 22 Apr 2024 10:56 AM (IST)

    మరికాసేపట్లోనే ఫలితాలు.. ఏర్పాట్లు పూర్తి

    మరికాసేపట్లో ఏపీ పదో తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏపీ విద్యాశాఖ కమిషనర్ సురేశ్ కుమార్ చేతుల మీదగా ఫలితాలు వెల్లడికానున్నాయి.

  • 22 Apr 2024 10:46 AM (IST)

    ఎన్నికల ‘కోడ్’ ఎఫెక్ట్‌: అందుకే.. ముందుగానే..

    గతేడాది ఏప్రిల్ 18వ తేదీతో పరీక్షలు పూర్తికాగా.. ఈ ఏడాది మార్చి 30వ తేదీతో పరీక్షలు కంప్లీట్ అయ్యాయి. ఇక 2023లో మే6వ తేదీన టెన్త్‌ రిజల్ట్స్‌ వెలువడ్డాయి. ఎన్నికల నేపథ్యంలో ఫలితాలు కూడా చాలా ముందుగా వెలువడుతున్నాయి.

  • 22 Apr 2024 10:43 AM (IST)

    8 రోజుల్లో పూర్తి చేసిన స్పాట్ వాల్యూయేషన్

    మార్చి 30న పదో తరగతి పరీక్షలు పూర్తికాగా.. ఆ మరుసటి రోజు అంటే ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 8 నాటికి మూల్యాంకనం పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా దాదాపు 25 వేల మంది సిబ్బంది మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేశారు.

  • 22 Apr 2024 10:36 AM (IST)

    గతేడాది కంటే ఈసారి భారీగా పెరిగిన పదో తరగతి విద్యార్ధుల సంఖ్య

    గతేడాది (2023) ఏపీ పదో తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,03,700 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈసారి మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాదితో పోల్చితే ఈసారి విద్యార్థుల సంఖ్య భారీగానే పెరిగింది. ఇక గతేడాది పదో తరగతి ఫలితాల్లో.. 72.26 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలురు 69.27 శాతం, బాలికలు 75.38 శాతం ఉత్తీర్ణత సాధించారు.

  • 22 Apr 2024 10:31 AM (IST)

    11.30 గంటలకు ఏపీ టెన్త్ ఫలితాలు.. అరగంట ఆలస్యంగా!

    ఏపీ పదో తరగతి ఫలితాలు తొలుత 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ కాస్త ఆలస్యంగా రానున్నాయి. ఉదయం 11.30 గంటలకు విడుదల కానున్నట్లు సమాచారం. ముందుగా ప్రకటించిన సమయం కంటే అరగంట ఆలస్యంగా రానున్నాయి.

  • 22 Apr 2024 10:15 AM (IST)

    పదో తరగతి రిజల్ట్స్ లైవ్ ఇక్కడ వీక్షించండి

    ఈ రోజు ఉదయం 11 గంటలకు విజయవాడలో విడుదల చేయనున్న టెన్త్ రిజల్ట్స్ ఇక్కడ నేరుగా వీక్షించండి

  • 22 Apr 2024 10:09 AM (IST)

    మరికొన్ని నిమిషాలే.. సరిగ్గా 11 గంటలకు ‘పది’ ఫలితాలు

    మరికొద్ది నిమిషాల్లో ప్రకటించనున్న పదో తరగతి పరీక్షా ఫలితాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ విడుదల చేయనున్నారు. విద్యార్ధుల కెరీర్‌కు పదో తరగతి మార్కులే కీలకం. దీంతో ఫలితాల కోసం వారంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఫలితాల ప్రకటనకు ముందే పలు ప్రైవేట్ కాలేజీల్లో ఇంటర్ అడ్మిషన్లు షురూ చేశాయి.

Published On - Apr 22,2024 10:03 AM

Follow us