TS TET 2024: ముగిసిన తెలంగాణ టెట్‌ అన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ.. మే 20 నుంచి పరీక్షలు

తెలంగాణలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగిసింది. ఏప్రిల్‌ 20 (శనివారం)తో తుది గడువు ముగిసింది. ముగింపు సమయం నాటికి 2,83,441 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిల్లో పేపర్‌ 1 పరీక్షకు 99,210 మంది దరఖాస్తు చేసుకోవగా.. పేపర్‌ 2 పరీక్షకు మరో 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుతు ఏప్రిల్‌ 10వ తేదీని చివరి తేదీగా ప్రకటించడంతో..

TS TET 2024: ముగిసిన తెలంగాణ టెట్‌ అన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ.. మే 20 నుంచి పరీక్షలు
TS TET 2024
Follow us

|

Updated on: Apr 22, 2024 | 8:07 AM

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22: తెలంగాణలో టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌ 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు ముగిసింది. ఏప్రిల్‌ 20 (శనివారం)తో తుది గడువు ముగిసింది. ముగింపు సమయం నాటికి 2,83,441 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకున్నారు. వీటిల్లో పేపర్‌ 1 పరీక్షకు 99,210 మంది దరఖాస్తు చేసుకోవగా.. పేపర్‌ 2 పరీక్షకు మరో 1,84,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలుతు ఏప్రిల్‌ 10వ తేదీని చివరి తేదీగా ప్రకటించడంతో ఏప్రిల్ 9 నాటికి కేవలం 1.90 లక్ష దరఖాస్తులు మాత్రమే అందాయి. ఆ తర్వాత మరో 10 రోజులు అంటే ఏప్రిల్‌ 20వ తేదీ వరకు దరఖాస్తు గడువు పొడిగించడంతో అప్లికేషన్ల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గత టెట్‌లో 2.91 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే.

అప్లికేషన్‌లోని వివరాలను సవరించుకునేందుకు అవకాశం ఇవ్వగా.. అందులో పేపర్‌ 1కి 6,626 మంది, పేపర్‌ 2కి 11,428 మంది అభ్యర్ధులు తమ వివరాలను సరిచేసుకున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం మే 20 నుంచి జూన్‌ 3 వరకు ఆన్‌లైన్‌ విధానంలో టెట్‌ పరీక్ష నిర్వహిస్తామని ఇప్పటికే విద్యాశాఖ స్పష్టం చేసింది. న్‌ 12న టెట్‌ 2024 ఫలితాలు విడుదల చేయనున్నారు. కాగా ఇప్పటికే 11,062 పోస్టులకు డీఎస్సీ ప్రకటన వెలువడింది. ఇప్పటికే టెట్‌లో అర్హత పొందిన వారు డీఎస్సీ ప్రిపరేషన్‌పై ఫోకస్‌ పెడుతున్నారు.

నేడే ఆంధ్రప్రదేశ్ డీఈఈ సెట్‌ 2024 నోటిఫికేషన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కాలేజీల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ డీఈఈ సెట్‌ 2024కు ఈ రోజు నోటిఫికేషన్‌ విడుదల కానున్నట్లు కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ తెలిపారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ డైట్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.