AP High Court Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. జిల్లాలవారీగా ఖాళీలు ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 681 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP High Court Recruitment 2022: డిగ్రీ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. జిల్లాలవారీగా ఖాళీలు ఇలా..
AP govt jobs 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 26, 2022 | 7:34 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హైకోర్టులో.. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 681 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అవసరం. జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్ధులు రూ.500, ఎస్సీ/ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనంతపురం ఖాళీలు: 53
  • చిత్తూరు ఖాళీలు: 67
  • తూర్పు గోదావరి ఖాళీలు: 80
  • గుంటూరు ఖాళీలు: 64
  • వైఎస్ఆర్ కడప ఖాళీలు: 46
  • కృష్ణా ఖాళీలు: 68
  • కర్నూలు ఖాళీలు: 17
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఖాళీలు: 33
  • ప్రకాశం ఖాళీలు: 41
  • శ్రీకాకుళం ఖాళీలు: 62
  • విశాఖపట్నం ఖాళీలు: 71
  • విజయనగరం ఖాళీలు: 21
  • పశ్చిమ గోదావరి ఖాళీలు: 58

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 80 మార్కుల చొప్పున 90 నిముషాల వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ఉంటాయి. ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారు. ఎస్సీ/ఎస్టీ వర్గాలకు చెందిన అభ్యర్ధులు 30 శాతం మార్కులు సాధిస్తే చాలు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!