AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP District Court Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.76ల జీతం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన..112 ఎగ్జామినర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP District Court Recruitment 2022: ఇంటర్ అర్హతతో ఆంధ్రప్రదేశ్‌ జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.76ల జీతం..
DMHO East Godavari Recruitment 2022
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 24, 2022 | 11:55 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన..112 ఎగ్జామినర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత బోర్డు నుంచి ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.23,780ల నుంచి రూ.76,730ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనంతపురం ఖాళీలు: 9
  • చిత్తూరు ఖాళీలు: 10
  • తూర్పు గోదావరి ఖాళీలు: 11
  • గుంటూరు ఖాళీలు: 10
  • వైఎస్ఆర్ కడప ఖాళీలు: 8
  • కృష్ణా ఖాళీలు: 17
  • కర్నూలు ఖాళీలు: 7
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరు ఖాళీలు: 2
  • ప్రకాశం ఖాళీలు: 6
  • శ్రీకాకుళం ఖాళీలు: 10
  • విశాఖపట్నం ఖాళీలు: 12
  • విజయనగరం ఖాళీలు: 2
  • పశ్చిమ గోదావరి ఖాళీలు: 8

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 80 మార్కుల చొప్పున 90 నిముషాల వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌ నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ఉంటాయి. ఈ రాత పరీక్షలో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారు అర్హత సాధిస్తారు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.