Cochin Shipyard Limited Jobs 2022: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో 356 అప్రెంటిస్ పోస్టుల దరఖాస్తు చేసుకున్నారా?2 రోజుల్లో ముగుస్తున్న..
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 356 అప్రెంటిస్ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో రెండు రోజుల్లో ముగుస్తున్న ఆన్‌లైన్..
భారత ప్రభుత్వ పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వశాఖకు చెందిన కేరళలోని కొచ్చిన్‌లో గల కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 356 అప్రెంటిస్ పోస్టులకు ఇంకా దరఖాస్తు చేసుకోలేదా? మరో రెండు రోజుల్లో ముగుస్తున్న ఆన్‌లైన్ దరఖాస్తులు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతి అర్హతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమనా కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే అక్టోబర్ 26, 2022వ తేదీ నాటికి దరఖాస్తుదారుల వయసు 18 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా అక్టోబర్ 26, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు, సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకైతే నెలకు రూ.8,000లు, టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ పోస్టులకు రూ.9000 చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
- ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 348
- టెక్నీషియన్ (ఒకేషనల్) అప్రెంటిస్ ఖాళీలు: 8
విభాగాల వారీగా ఖాళీలు..
- ఎలక్ట్రీషియన్ ఖాళీలు: 46
- ఫిట్టర్ ఖాళీలు:36
- వెల్డర్ ఖాళీలు:47
- మెషినిస్ట్ ఖాళీలు:10
- ఎలక్ట్రానిక్ మెకానిక్ ఖాళీలు:15
- ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఖాళీలు:14
- డ్రాఫ్ట్స్‌మన్ (మెకానికల్) ఖాళీలు:6
- డ్రాఫ్ట్స్‌మన్ (సివిల్) ఖాళీలు:4
- పెయింటర్ (జనరల్) ఖాళీలు:10
- మెకానిక్ మోటార్ వెహికల్ ఖాళీలు:10
- షీట్ మెటల్ వర్కర్ ఖాళీలు:47
- షిప్ రైట్ వుడ్ (కార్పెంటర్) ఖాళీలు:19
- మెకానిక్ డీజిల్ ఖాళీలు:37
- రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ ఖాళీలు:10
- అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ ఖాళీలు:1
- బేసిక్ నర్సింగ్ మరియు పాలియేటివ్ కేర్ ఖాళీలు:1
- కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్ ఖాళీలు:2
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ఖాళీలు:1
- ఫుడ్ అండ్ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ ఖాళీలు:3
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.