AP Govt Jobs 2022: 7వ తరగతి పాస్‌/ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యారా? ఆంధ్రప్రదేశ్‌ వివిధ జిల్లాల్లో 1520 ఉద్యోగావకాశాలు.. దరఖాస్తు ఇలా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా హైకోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన..1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల..

AP Govt Jobs 2022: 7వ తరగతి పాస్‌/ఇంటర్‌ ఫెయిల్‌ అయ్యారా? ఆంధ్రప్రదేశ్‌ వివిధ జిల్లాల్లో 1520 ఉద్యోగావకాశాలు.. దరఖాస్తు ఇలా..
AP High Court Recruitment 2022
Follow us

|

Updated on: Oct 24, 2022 | 11:39 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా హై కోర్టుల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన..1520 ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏడో తరగతి లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన అభ్యర్ధులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉన్నత విద్యావంతులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. జులై 1, 2022వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 11, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.800లు, ఎస్సీ/ఎస్టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.20,000ల నుంచి రూ.61,960ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జిల్లాల వారీగా ఖాళీల వివరాలు..

  • అనంతపురంలో ఖాళీలు: 92
  • చిత్తూరులో ఖాళీలు: 168
  • తూర్పు గోదావరిలో ఖాళీలు: 156
  • గుంటూరులో ఖాళీలు: 147
  • వైఎస్ఆర్ కడపలో ఖాళీలు: 83
  • కృష్ణాలో ఖాళీలు: 204
  • కర్నూలులో ఖాళీలు: 91
  • ఎస్‌పీఎస్‌ఆర్‌ నెల్లూరులో ఖాళీలు: 104
  • ప్రకాశంలో ఖాళీలు: 98
  • శ్రీకాకుళం ఖాళీలు: 87
  • విశాఖపట్నం ఖాళీలు: 125
  • విజయనగరం ఖాళీలు: 57
  • పశ్చిమ గోదావరి ఖాళీలు: 108

రాత పరీక్ష విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో జరిగే రాత పరీక్ష మొత్తం 80 మల్టిపుల్ ఛాయిస్‌ ప్రశ్నలకు 80 మార్కుల చొప్పున 90 నిముషాల వ్యవధిలో రాయవల్సి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్‌ నుంచి 40 ప్రశ్నలు, ఇంగ్లిష్ ల్యాంగ్వేజ్‌ నుంచి 10 ప్రశ్నలు, మెంటల్‌ ఎబిలిటి నుంచి 30 ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నలు ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ఉంటాయి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎదురులేని రాజస్థాన్.. లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్‌కు మరింత చేరువ
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్..నడి రోడ్డుపై కూర్చీవేసుకు
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
మంజుమ్మల్ బాయ్స్ ఓటిటిలోకి వచ్చేది ఎప్పుడంటే ??
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి