AP Jobs: ఆంధ్రప్రదేశ్ గూడురు ఏరియా ఆసుపత్రిలో మెడికల్ పోస్టుల భర్తీ.. నెలకు రూ. 60 వేలకుపైగా జీతం పొందే అవకాశం..
AP Jobs: నెల్లూరు జిల్లాలోని గూడురు ఏరియా ఆసుపత్రి ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌ల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో..
AP Jobs: నెల్లూరు జిల్లాలోని గూడురు ఏరియా ఆసుపత్రి ఆర్‌టీపీసీఆర్ ల్యాబ్‌ల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఏపీ ప్రభుత్వం ఈ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో తీసుకోనున్నారు. నోటిఫికేషన్‌లో భాగంగా ఏయో విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.? లాంటి పూర్తి వివరాలు..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో రిసెర్చ్ సైంటిస్ట్ (01), రిసెర్చ్ అసిస్టెంట్ (02), ల్యాట్ టెక్నీషియన్ (06), డేటా ఎంట్రీ ఆపరేటర్లు (03), మల్టీ టాస్కింగ్ స్టాప్ (03) పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా (ఎంఎల్‌టీ), ఏదైనా డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎండీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధి పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 01-07-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* దరఖాస్తులను ది మెడికల్ సూపరిండెంట్, ఏరియా హాస్పిటల్, గూడురు, ఎస్.పీ.ఎస్.ఆర్ నెల్లూరు జిల్లా, ఓల్డ్ ఏపీఎస్‌ఆర్టీసీ బస్‌స్టాప్ పక్కన, గూడురు అడ్రస్‌కు పంపించాలి.
* అభ్యర్థులను అర్హత పరీక్షలో సాధించిన మార్కులు, సర్వీస్ వెయిటేజ్, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
* ఎంపికైన వారికి నెలకు రూ. 12000 నుంచి రూ. 65000 వరకు చెల్లిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 27-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం.. మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!
Viral Video: ఎలక్ట్రిక్ ఈల్‌ను వేటాడాలనుకున్న మొసలి.. షాకింగ్.. ఊహించని విషాదాంతం..