Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం.. మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!

Viral Video: కొన్ని కొన్నిసార్లు కొందరు వ్యక్తులు చేసే ప్రయోగాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. సరికొత్తగా, విచిత్రంగా అనిపిస్తుంటాయి. అయితే, వీటిలో కొన్ని ప్రయోగాలు

Viral Video: ఫిట్‌నెస్‌కి ఫిట్‌నెస్, వినోదానికి వినోదం.. మనోడి ఐడియా చూస్తే దిమ్మతిరిగిపోతుంది..!
Follow us
Shiva Prajapati

|

Updated on: Dec 19, 2021 | 9:24 PM

Viral Video: కొన్ని కొన్నిసార్లు కొందరు వ్యక్తులు చేసే ప్రయోగాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి. సరికొత్తగా, విచిత్రంగా అనిపిస్తుంటాయి. అయితే, వీటిలో కొన్ని ప్రయోగాలు వెలుగులోకి వస్తే.. మరికొన్ని ప్రయోగాలు వెలుగులోకి రాకుండా ఉంటాయి. తాజాగా ఓ వ్యక్తి ఆవిష్కరణకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా చాలా మంది తమ ఆరోగ్యం కోసం సైక్లింగ్ చేస్తుంటారు. అయితే, ఇక్కడ ఓ వ్యక్తి తాను చేసే సైక్లింగ్‌ మిషన్‌తో సరికొత్త ప్రయోగం చేశాడు. వర్కౌట్ సైకిల్‌తో మూవింగ్ ట్రాక్‌ను రూపొందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో షేర్ చేశారు. వీడియోలో పిల్లలు ఆడుకునే మూవింగ్ ట్రాక్ ఉంటుంది. దాని పక్కన ఒక వ్యక్తి సైక్లింగ్ ఎక్సర్‌సైజ్ చేస్తున్నాడు. అయితే, సైక్లింగ్ చైన్‌కి, మూవింగ్ ట్రాక్ వెహికిల్‌కి లింక్ చేయడంతో ఆ వెహికిల్ మూవ్ అవ్వడం దాని ప్రత్యేకత. ఈ ప్రయోగాన్ని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ మినీ స్వింగ్‌ను తయారు చేసిన వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్.. ‘వీడియోతో పాటు ఫన్ + ఫిట్‌నెస్ + ఫిజిక్స్, #SuperDad 3 ఇన్ 1 ఫార్ములా అద్భుతంగా ఉంది.’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోను ఇప్పటి వరకు 19 వేల మంది వీక్షించారు. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ఆటతో పాటు ఆరోగ్యం సోంతం చేసుకుంటున్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ రాస్తున్నారు. ‘ఒకే ప్రయత్నంలో తండ్రికి ఫిట్‌నెస్, కొడుక్కి ఎంజాయ్. అద్భుత ఆవిష్కరణ ఇది.’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Viral Video:

Also read:

Room Heaters: చలి చంపేస్తోంది..దుప్పట్లు కూడా వెచ్చదనాన్ని ఇవ్వడంలేదు..గది మొత్తం వేడి పుట్టించే ఈ హీటర్స్ ట్రై చేయండి..

Buddha Temple in Pakistan: పాకిస్తాన్‌లో వెలుగుచూసిన అతి పురాతన బౌద్ధ దేవాలయం..ఎంత పురాతనమైనది అంటే..

Lakshmi Manchu: నెట్టింట వైరల్ అవుతున్న యాక్సిడెంట్ పిక్స్‌.. క్లారిటీ ఇచ్చిన మంచు లక్ష్మి.. అసలేమైందంటే..?