AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2022: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు ఈ రోజు (జులై 4) నుంచి ప్రారంభమయ్యాయి..

AP EAPCET 2022: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే..
Ap Eapcet 2022
Srilakshmi C
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 04, 2022 | 3:13 PM

Share

AP EAPCET 2022 Exam Dates: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ 2022 పరీక్షలు ఈ రోజు (జులై 4) నుంచి ప్రారంభమయ్యాయి. ఏపీ ఈఏపీసెట్‌ 2022 ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించిన పరీక్ష మొత్తం 5 రోజుల్లో.. జులై 4, 5, 6, 7, 8 తేదీల్లో జరగనుంది. ఆన్‌లైన్‌ విధానంలో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్‌, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్షలు జులై 11, 12 తేదీల్లో 4 సెషన్లలో జరగనున్నాయి. ఆయా పరీక్షల తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్‌ పరీక్ష, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్‌ పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయానికి నిముషం ఆలస్యమైనా లోపలికి అనుమతించబోమని అధికారులు ఇప్పటికే ప్రకటించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, వాచ్‌లను అనుమతించేదిలేదని అధికారులు తెలిపారు.

కాగా ఏపీ ఈఏపీసెట్‌ 2022 క్వశ్యన్‌ పేపర్‌ ఇంగ్లిష్‌, తెలుగు మాధ్యమాల్లో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలకు 180 నిముషాల పాటు పరీక్ష జరుగుతుంది. ఆగస్టు 15 తర్వాత ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఎగ్జాం ప్యాట్రన్‌, ర్యాంకుల విధానంలో ఎటువంటి మార్పులులేవని, గత ఏడాది మాదిరిగానే ఉంటుందని, సెప్టెంబర్‌ రెండో వారంలోగా తరగతులు ప్రారంభించేందుకు అనుగుణంగా షెడ్యూల్‌ తయారు చేసినట్లు ఏపీ విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈ, బీటెక్‌, బీటెక్‌ (బయోటెక్‌), బీటెక్‌ (డైరీ టెక్నాలజీ), బీటెక్‌ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్), బీఫార్మసీ, బీటెక్‌ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్, బీఎస్సీ (ఆనర్స్) హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ, బీవీఎస్సీ, ఏహెచ్‌, బీఎఫ్‌ఎస్సీ, Pharm-D కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి