AP 10th class Exams 2024: పదో తరగతి పరీక్షల్లో పేపర్ లీక్‌లు అరికట్టేందుకు ఎస్సెస్సీ బోర్డు కీలక నిర్ణయం! ఇక మాల్ ప్రాక్టీస్‌కు నో ఛాన్స్..
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులు పరీక్షలకు ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటు పలు ఉద్యోగ నియామక పరీక్షలు కూడా వరుసగా జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో SSC బోర్డు డైరెక్టర్ డేవానంద రెడ్డి కీలక ప్రకటన వెలువరించారు. మార్చి 18 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు కీలక నిర్ణయం..
అమరావతి, ఫిబ్రవరి 25: తెలుగు రాష్ట్రాల్లో విద్యార్ధులు పరీక్షలకు ప్రిపరేషన్‌లో బిజీగా ఉన్నారు. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలతోపాటు పలు ఉద్యోగ నియామక పరీక్షలు కూడా వరుసగా జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మార్చి 18 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో SSC బోర్డు డైరెక్టర్ డేవానంద రెడ్డి కీలక ప్రకటన వెలువరించారు. మార్చి 18 నుంచి జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై QR కోడ్ తో ఉన్న ప్రశ్నపత్రాలు విద్యార్ధులకు ఇవ్వాలని ఎస్సెస్సీ బోర్డు నిర్ణయించింది. దీని ద్వారా పేపర్ లీక్ అయితే ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా వెంటనే తెలుసుకునేలా కొత్త విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని ఈ యేడాది నుంచే అమలు చేయనున్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకే క్యూఆర్ పద్ధతిని తీసుకొచ్చినట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 ఫిబ్రవరి 18న ప్రారంభమై ఫిబ్రవరి 30వ తేదీతో ముగియనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 09:30 నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఏపీ పదో తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ఇదే
- మార్చి 18, 2024 సోమవారం- ఫస్ట్ లాంగ్వేజ్
- మార్చి 19, 2024 మంగళవారం- సెకండ్ లాంగ్వేజ్
- మార్చి 20, 2024 బుధవారం- ఇంగ్లిష్
- మార్చి 22, 2024 శుక్రవారం- మ్యాథమెటిక్స్
- మార్చి 23, 2024 శనివారం- ఫిజికల్ సైన్స్
- మార్చి 26, 2024 మంగళవారం- జీవశాస్త్రం
- మార్చి 27, 2024 బుధవారం- సోషల్ స్టడీస్
- మార్చి 28, 2024 గురువారం- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ – II (కంపోజిట్ కోర్సు)
- మార్చి 29, 2024 శుక్రవారం- OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – I (సంస్కృతం, అరబిక్, పర్షియన్)
- మార్చి 30, 2024 శనివారం- OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – II (సంస్కృతం, అరబిక్, పర్షియన్), SSC వొకేషనల్ కోర్సు (థియరీ)
మరోవైపు తెలంగాణలోనూ మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 7 పేపర్లకు పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 18న ఫస్ట్ లాంగ్వేజ్, ఫిబ్రవరి19న సెకండ్ లాంగ్వేజ్, ఫిబ్రవరి21న ఇంగ్లిష్, ఫిబ్రవరి 23న మ్యాథ్స్, ఫిబ్రవరి 26న సైన్స్ పేపర్-1, ఫిబ్రవరి 28న పేపర్-2, ఫిబ్రవరి 30న సోషల్ స్టడీస్, ఫిబ్రవరి 1వ తేదీన ఒకేషనల్ కోర్సువారికి సంస్కృతం, ఆరబిక్ పేపర్ 1, ఫిబ్రవరి 2న పేపర్-2 పరీక్షలు జరుగనున్నాయి.
మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.