AP Inter Supplementary 2024 Results: ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.40 లక్షల మంది..

AP Inter Supplementary 2024 Results: ఏపీ ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ చెక్‌ చేసుకోండి
AP Inter supply Results
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Jun 18, 2024 | 4:28 PM

అమరావతి, జూన్‌ 18: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు మంగళవారం (జూన్‌ 18) విడుదలయ్యాయి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.40 లక్షల మంది హాజరయ్యారు. కాగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితియ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల 2024 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ ఓపెన్‌ చేయాలి.
  • తర్వాత ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ సప్లిమెంటరీ రిజల్ట్స్‌ లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • పేరు, రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ వంటి అన్ని వివరాలను నమోదు చేసి, సబ్‌మిట్‌ చేయాలి.
  • వెంటనే స్క్రీన్‌పై ఇంటర్ ఫలితాలు వస్తాయి.
  • సేవ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం హార్డ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

తొలుత ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఫలితాలు, ఆ తర్వాత ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఈ రోజు ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఇక ఇంటర్‌ మొదటి ఏడాది అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు జూన్‌ 26న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇంటర్మిడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారిగా డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం చేశారు. ఇంటర్‌ ఫలితాల అనంతరం రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి పలు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు చేపడతారు. ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇవి కూడా చదవండి

నేటి నుంచి డిగ్రీ ప్రవేశాలు

జూన్ 18 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుంది.‌ ఆన్‌లైన్‌లోనే విద్యార్ధులు కాలేజీలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అడ్మిషన్ మాడ్యుల్ ఫర్ డిగ్రీ కాలేజెస్ (ఓఏఏండీసీ) ద్వారా డిగ్రీ ప్రవేశాలు నేటి నుంచి జూన్‌ 29 వరకు కొనసాగుతాయి. కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. ఇంటర్మీడియట్ లో 90 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు మొదట దశలో ప్రవేశాలు కల్పిస్తారు. 80 నుంచి 90 శాతం మధ్య మార్కులు సాధించిన విద్యార్థులకు రెండో దశలో, 80 శాతం కంటే తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు చివరి దశలో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలోని ప్రస్తుతం 3.19 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది 1.53 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Latest Articles
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..
ఈ చిన్న మార్పులతో ఏమీ చేయకుండానే వెయిట్ లాస్ అవ్వొచ్చు..
కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు..
కూల్ న్యూస్ వచ్చేసింది.. ఇక వచ్చే ఐదు రోజులు వర్షాలే.. వర్షాలు..
ఐసీసీ ర్యాంకుల్లో 'టాప్' కోల్పోయిన సూర్య .. ఎవరొచ్చారో తెలుసా?
ఐసీసీ ర్యాంకుల్లో 'టాప్' కోల్పోయిన సూర్య .. ఎవరొచ్చారో తెలుసా?
ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేశారంటే ఇస్రోలో సైంటిస్ట్‌ కొలువు మీదే
ఇంటర్‌ తర్వాత ఈ కోర్సులు చేశారంటే ఇస్రోలో సైంటిస్ట్‌ కొలువు మీదే
వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
వైసీపీ ఆఫీసుల కూల్చివేతపై విచారణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు..
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే!
ఈ రాశులకు చెందిన జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలతలే!
ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..
ఈ ఎల్ఐసీ ప్లాన్‌లో చేరితే.. రూ. లక్ష వరకూ పెన్షన్.. వివరాలు ఇవి..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
కల్కి మూవీ టీం కు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. వీడియో.
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
250 కోట్లు అప్పు చుట్టుముట్టిన కష్ట - నష్టాలు.! చిక్కుల్లో రకుల్
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
దూసుకొస్తున్న గ్రహశకలం.. భూమిని ఢీ కొట్టే చాన్స్..
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు.. ఉరికిన పోలీసులు. స్వయంగా సీఐకి ఫోన్
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
సబ్బుపై కాలేసి మూడవ అంతస్తు నుంచి జారిపడ్డ మహిళ.. వీడియో వైరల్..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు..
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
శ్రీనివాసుని భక్తులకు టీటీడీ విజ్ఞప్తి. ప్రత్యేక దర్శనం, లడ్డూ ధర
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
ముంచుకొస్తున్న మ‌రో యుద్ధం.. యూఎన్ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్‌వార్నింగ్.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
సరికొత్త ఫీచర్‌.. వాట్సాప్‌లోనే సాధారణ కాలింగ్‌ ఆప్షన్‌.!
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు
అమ్మో.. మహానంది అలయ పరిసరాల్లో చిరుత హల్ చల్.. భయాందోళనలో భక్తులు