AP ICET 2025 Toppers List: ఏపీ ఐసెట్ 2025 ఫలితాల్లో విశాఖ కుర్రోడి సత్తా.. ఎన్ని మార్కులొచ్చాయో చూశారా?
ఐసెట్ 2025 ఫలితాలు మంగళవారం (మే 20) విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి..

అమరావతి, మే 21: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (APICET) 2025 ఫలితాలు మంగళవారం (మే 20) విడుదలైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ ఫలితాలను పొందవచ్చు. మే 7వ తేదీన తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 94 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించగా కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించింది.
ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2025-26 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జరిగిన ఐసెట్ పరీక్షకు మొత్తంగా 37,572 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 34,131మంది పరీక్షకు హాజరయ్యారు. ఐసెట్‌లో 32,719 మంది అర్హత సాధించారు. వీరిలో 15,176 మంది అబ్బాయిలు, 17,543 మంది అమ్మాయిలు ఉన్నారు. తాజా ఫలితాల్లో విశాఖపట్నంకి చెందిన మనోజ్ మేకా అత్యధిక మార్కులతో స్టేట్ టాపర్‌గా నిలిచాడు. టాప్ 10 ర్యాంకర్లు ఈ కింద చెక్ చేసుకోవచ్చు.
ఏపీ ఐసెట్ 2025 ఫలితాల్లో టాప్ 10 ర్యాంకర్లు వీరే..
- మనోజ్ మేకా (విశాఖపట్నం) 197.9140 మార్కులు
- ద్వారకచర్ల సందీప్ రెడ్డి (వైఎస్‌ఆర్ కడప) 179.5174 మార్కులు
- ఎస్. కృష్ణసాయి (ఎన్‌టీఆర్ జిల్లా) 178.5175 మార్కులు
- వల్లూరి సాయిరాం సాత్విక్ (హైదరాబాద్) 175.6945 మార్కులు
- రేవూరి మాధుర్య (గుంటూరు) 175.4529 మార్కులు
- షేక్ బషీరున్నీషా (అనకాపల్లి) 175.3132 మార్కులు
- వి. అజయ్ కుమార్ (తిరుపతి) 174.1794 మార్కులు
- భీశెట్టి హరి వెంకట ప్రసాద్ (తూర్పుగోదావరి) 173.7501 మార్కులు
- ఎస్. గణేశ్ రెడ్డి (విశాఖపట్నం) 173.6118 మార్కులు
- మహేంద్ర సాయి చామా (తిరుపతి) 171.9104 మార్కులు
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




