AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Gurukula Admissions 2025: ఇవాళ్టి నుంచి గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షురూ.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. విద్యార్ధులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా గురుకులాల్లో సీట్ల..

AP Gurukula Admissions 2025: ఇవాళ్టి నుంచి గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ షురూ.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి
Gurukula School Admissions
Srilakshmi C
|

Updated on: May 21, 2025 | 1:20 PM

Share

అమరావతి, మే 21: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకుల పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. విద్యార్ధులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఆయా గురుకులాల్లో సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్లను మే 21 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు సంయుక్త కార్యదర్శి ఎండీ ఉబేదుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులు మాత్రమే మే 21 నుంచి 30లోపు సంబంధిత గురుకుల పాఠశాలలల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరై ప్రవేశాలు పొందాలని ఆయన సూచించారు. విద్యార్ధులు తమ ర్యాంకు కార్డులతోపాటు విద్యా, కులా, ఆదాయ సర్టిఫికెట్లు తమతోపాటు తెచ్చుకోవాలని తెలిపారు.

ఏపీ గురుకుల ఐదో తరగతి ప్రవేశాల కౌన్సెలింగ్ 2025 వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రాథమిక కీ విడుదల.. అభ్యంతరాలకు మే 22 వరకు గడువు

ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ ప్రోగ్రామ్‌లో 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశాలకు నిర్వహించిన నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (NCET) ప్రాథమిక ఆన్సర్ కీని ఎన్‌టీఏ తాజాగా విడుదల చేసింది. ఈ కీ పై అభ్యంతరాలకు తెలిపేందుకు మే 22వ తేదీ వరకు అవకాశం కల్పించింది. కాగా నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025ను ఏప్రిల్‌ 29న నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలోని 13 భాషల్లో ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్ష జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ (ITEP)లో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఆర్‌ఐఈలు, ప్రభుత్వ కాలేజీలతో సహా వివిధ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కల్పించనుంది. ఈ ర్యాంకు ద్వారా దేశవ్యాప్తంగా 64 జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో మొత్తం 6,100 సీట్లలో ఐటీఈపీ ప్రోగ్రామ్‌లోనూ అడ్మిషన్లు పొందవచ్చు. అందుకు ఆయా సంస్థలు కౌన్సెలింగ్‌ నిర్వహించి బీఏ-బీఈడీ, బీకాం-బీఈడీ, బీఎస్సీ-బీఈడీ కోర్సు సీట్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 ప్రాథమిక కీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్