AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP EAPCET 2025 Hall Tickets: ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయోచ్‌.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఈఏపీసెట్‌) ఆన్‌లైన్‌ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ పరీక్షల హాల్ టికెట్లు తాజాగా విడుదలయ్యాయి..

AP EAPCET 2025 Hall Tickets: ఏపీ ఈఏపీసెట్‌ హాల్‌టికెట్లు వచ్చేశాయోచ్‌.. పరీక్షల పూర్తి షెడ్యూల్‌ ఇదే
AP EAPCET 2025 hall tickets
Srilakshmi C
|

Updated on: May 18, 2025 | 6:24 AM

Share

అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్‌-ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న ఏపీ స్టేట్‌ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఈఏపీసెట్‌) ఆన్‌లైన్‌ పరీక్షలు మే 19 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉన్నత విద్యా మండలి ఏపీ-ఈఏపీసెట్‌ 2025కు సంబంధించిన హాల్‌టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు మే 12 నుంచి అధికారిక వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఛైర్మన్‌ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, కన్వీనర్‌ వీవీ సుబ్బారావు ఓ ప్రటనలో తెలిపారు. ఈ ఏడాది ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు కలిపి మొత్తం 3,61,299 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.

ఈ పరీక్షలు మే 19 నుంచి మే 27వ తేదీ వరకు జరగనున్నట్లు తెలిపారు. హాల్‌ టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌ తోపాటు రాష్ట్ర ప్రభుత్వ వాట్సప్‌ గవర్నెన్స్‌ 95523 00009 నుంచి కూడా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈసారి విద్యార్ధులు పరీక్షా కేంద్రం సులువుగా తెలుసుకునేలా హాల్‌టికెట్‌లో రూట్‌మ్యాప్‌ కూడా ఇచ్చినట్లు కన్వీనర్‌ వీవీ సుబ్బారావు చెప్పారు. ఇతర సందేహాలకు 0884-2359599, 2342499 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఏపీ ఈఏపీసెట్‌ 2025 హాల్‌టికెట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు మే 19, 20 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు మే 21 నుంచి 27వ తేదీ వరకు జరుగుతాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా తమ హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని విద్యార్ధులకు సూచించారు. ఇక పరీక్షల అనంతరం అగ్రికల్చర్‌, ఫార్మసీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని మే 21వ తేదీన విడుదల చేస్తారు. ఇంజినీరింగ్‌ విభాగం ప్రాథమిక ఆన్సర్‌ కీని మే 28వ తేదీన విడుదల చేయనున్నారు. ఫైనల్‌ ఆన్సర్‌ కీని జూన్‌ 5వ తేదీన ప్రకటించి, ఆ వెనువెంటనే ఫలితాలు కూడా విడుదల చేస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్