Air India Jobs 2023: టెన్త్ అర్హతతో లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు.. ఈ తేదీల్లోనే..
ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 36 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్‌ఎస్‌ఏ/ యూఏఆర్‌డీ, హ్యాండిమ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..
ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్.. వారణాసిలోని లాల్‌బహదూర్‌శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో 36 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, ఆర్‌ఎస్‌ఏ/ యూఏఆర్‌డీ, హ్యాండిమ్యాన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/10వ తరగతి/ఐటీఐ/మూడేళ్ల డిప్లొమా/గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 28 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్నవారు 2023, ఏప్రిల్ 24, 25, 26 తేదీల్లో కింది అడ్రస్‌లో ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించే ఇంటర్వ్యూకి సంబంధిత డాక్యుమెంట్లతో నేరుగా హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ.500లు చెల్లించవల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్‌మెన్/ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఇంటర్వ్యూ/ ట్రేడ్ టెస్ట్/ ఫిజికల్ ఎండ్యురెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.17,850ల నుంచి రూ.23,640ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు..
- కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు: 11
- ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యూఏఆర్‌డీ పోస్టులు: 5
- హ్యాండిమ్యాన్ పోస్టులు: 20
అడ్రస్:
Pandit Deen Dayal Upaydhayay Inter Collage, Siswan, Babatpur, Varanasi, Pin – 221006, Uttar Pradesh.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.