AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NEET UG-2023 Registration: గుడ్‌న్యూస్‌.. నీట్‌ యూజీ-2023 అభ్యర్ధులకు మరో అవకాశం.. రేపట్నుంచి మళ్లీ తెరచుకోనున్న

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌- యూజీ 2023) పరీక్ష దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 6తో ముగిసిన విషయం తెలిసిందే. ఐతే చివరి నిముషంలో దరఖాస్తు చేయలేకపోయామంటూ కొందరు విద్యార్థులు చేసిన విజ్ఞప్తుల మేరకు ఎన్‌టీఏ మరో అవకాశం..

NEET UG-2023 Registration: గుడ్‌న్యూస్‌.. నీట్‌ యూజీ-2023 అభ్యర్ధులకు మరో అవకాశం.. రేపట్నుంచి మళ్లీ తెరచుకోనున్న
NEET UG 2023
Srilakshmi C
|

Updated on: Apr 10, 2023 | 9:43 PM

Share

నేషనల్‌ ఎలిజిబిలిటీ కమ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌- యూజీ 2023) పరీక్ష దరఖాస్తుల గడువు ఏప్రిల్‌ 6తో ముగిసిన విషయం తెలిసిందే. ఐతే చివరి నిముషంలో దరఖాస్తు చేయలేకపోయామంటూ కొందరు విద్యార్థులు చేసిన విజ్ఞప్తుల మేరకు ఎన్‌టీఏ మరో అవకాశం ఇచ్చింది. దీంతో ఏప్రిల్‌ 11 నుంచి 13వ తేదీ రాత్రి 11.30గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. నీట్‌ యూజీ పరీక్షకు గతంలో దరఖాస్తు చేసుకోలేకపోయిన వారికి మంగళవారం నుంచి అధికారిక వెబ్‌సైట్‌ లో రిజిస్ట్రేషన్ల ట్యాబ్‌ను మళ్లీ అందుబాటులో ఉంచనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ ఫీజు కూడా13వ తేదీ అర్ధరాత్రి 11.59గంటల వరకు ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. అలాగే ఇప్పటికే అప్లై చేసుకున్న విద్యార్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే సవరణకు ఎన్‌టీఏ కరెక్షన్‌ విండోను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

కాగా మే 7వ తేదీన (ఆదివారం) మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు దేశ వ్యాప్తంగా 499 నగరాల్లో నీట్‌ యూజీ పరీక్ష జరగనుంది. ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భారతీయ భాషల్లో ఆఫ్‌లైన్‌ విధానంలో (పెన్ను, పేపర్‌ విధానంలో) ఈ పరీక్షను నిర్వహిస్తారు. నీట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీఎస్‌ఎంఎస్‌, బీయూఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. గతేడాది 17.64లక్షల మంది నీట్‌ యూజీ పరీక్ష రాయగా.. ఈ ఏడాది 18 లక్షల మంది రాసే అవకాశం ఉందని అధికారలు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
కొండచిలువ వర్సెస్ చిరుతపులి పోరాటంలో గెలుపు ఎవరిది..?
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ఈ రెండు పనులు చేయకపోతే తల్లికి వందనం కట్.. ప్రభుత్వం అలర్ట్
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
ట్రంప్‌కే ధమ్కీ.. లేపేస్తే రూ.83 కోట్ల రివార్డు అంటూ ప్రకటన
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
Garuda Purana: మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? యమలోకానికి..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్..
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
టెన్త్ మార్కులతో నేరుగా రైల్వేలో 6,777 ప్రభుత్వ ఉద్యోగాలు.. లింక్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
కోహ్లీ, గంభీర్ మధ్య గొడవలా..? అసలు విషయం ఇదేనన్న బ్యాటింగ్ కోచ్
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
బంగారం ధరలు భారీగా డౌన్.. ఒక్కరోజులోనే ఢమాల్..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇవి తింటే కళ్ళజోడు అవసరం లేదు..
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ
తెలంగాణలో కొత్త ఫించన్లపై బిగ్‌ అప్‌డేట్.. ఆ రోజు నుంచే పంపిణీ