TS 10th Class Exams: ఏప్రిల్ 13 నుంచి పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం.. ఈ సారి కొత్తగా 6 స్పాట్‌ వాల్యుయేషన్లు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఏప్రిల్‌ 11వ తేదీలో ముగియనున్నాయి. 12, 13 తేదీల్లో సంస్కృతం, అరబిక్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్షలు జరుగుతాయి. దీంతో ఏప్రిల్ 13 నుంచే..

TS 10th Class Exams: ఏప్రిల్ 13 నుంచి పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనం.. ఈ సారి కొత్తగా 6 స్పాట్‌ వాల్యుయేషన్లు
TS 10th Class Exams evaluation
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 10, 2023 | 9:03 PM

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్‌ 3 నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ఏప్రిల్‌ 11వ తేదీలో ముగియనున్నాయి. 12, 13 తేదీల్లో సంస్కృతం, అరబిక్‌ ల్యాంగ్వేజ్‌ పరీక్షలు జరుగుతాయి. దీంతో ఏప్రిల్ 13 నుంచే పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. ఈసారి కొత్తగా ఆరు స్పాట్‌ వాల్యుయేషన్‌ కేంద్రాలను విద్యాశాఖ ఏర్పాటు చేయనుంది. ఇప్పటివరకు 12 కేంద్రాలుండగా, కొత్తగా ఈసారి జగిత్యాల, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, సిద్దిపేట, మంచిర్యాల పట్టణాల్లో పదో తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ విద్యాశాఖ తెల్పింది.

కాగా పదో తరగతి పరీక్షల పేపర్‌లీకుల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పరీక్షల మూల్యాంకనం, ఫలితాల వెల్లడి విషయంలో ఎటువంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. దీనిలో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.