Teacher Jobs: ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్… అర్హతలు, ఇతర వివరాలివే..

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Jodhpur) తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్  (Assistant Professor jobs)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Teacher Jobs: ఎయిమ్స్ జోధ్‌పూర్‌లో టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్... అర్హతలు, ఇతర వివరాలివే..
Aiims Jodhpur
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 28, 2022 | 2:46 PM

AIIMS Jodhpur Faculty Recruitment 2022: భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన జోధ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS Jodhpur) తాత్కాలిక ప్రాతిపదికన అసిస్టెంట్ ప్రొఫెసర్  (Assistant Professor jobs)పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య: 5

ఖాళీల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్

విభాగాలు: జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహేబిలిటేషన్.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత కోర్సుల్లో మాస్టర్స్ డిగ్రీ, ఎండీ/ఎంస్, డీఎం/ఎంసీహెచ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయో పరిమితి: అభ్యర్ధుల వయసు ఫిబ్రవరి 2, 2022 నాటికి 50 ఏళ్లకు మించరాదు.

పే స్కేల్: రూ.1,42,506లు నెలకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

OIL India Jobs: ఆయిల్ ఇండియా లిమిటెడ్‌లో 62 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలివే..