AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TG DSC 2024 Exam Key: డీఎస్సీ ఆన్సర్‌ ‘కీ’ని సవాల్ చేస్తూ పోటెత్తిన అభ్యంతరాలు.. ఆగస్టు నెలాఖరుకి ఫైనల్‌ కీ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాథమిక కీ విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రిలిమినరీ ‘కీ’తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5.00 గంటలతో ముగిసింది. అయితే ఎన్నడూ లేనిది విద్యాశాఖ..

TG DSC 2024 Exam Key: డీఎస్సీ ఆన్సర్‌ 'కీ'ని సవాల్ చేస్తూ పోటెత్తిన అభ్యంతరాలు.. ఆగస్టు నెలాఖరుకి ఫైనల్‌ కీ విడుదల
TG DSC 2024 Exam Key
Srilakshmi C
|

Updated on: Aug 21, 2024 | 8:32 AM

Share

హైదరాబాద్‌, ఆగస్టు 21: తెలంగాణ రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాథమిక కీ విడుదలైనప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. ప్రిలిమినరీ ‘కీ’తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ‘కీ’పై అభ్యంతరాలను స్వీకరించేందుకు ఆగస్టు 20వ తేదీ సాయంత్రం 5.00 గంటలతో ముగిసింది. అయితే ఎన్నడూ లేనిది విద్యాశాఖ విడుదల చేసిన డీఎస్సీ ప్రాథమిక ‘కీ’పై భారీగా అభ్యంతరాలు రావడం గమనార్హం. ఈసారి ప్రాథమిక ‘కీ’ని సవాల్‌ చేస్తూ దాదాపు 28,500 అభ్యంతరాలు వచ్చినట్టు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా జూలై 18 నుంచి ఆగస్టు 13 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రాథమిక కీలను ఆగస్టు 13న విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించారు. ఆగస్టు నెలాఖరులో ఫైనల్‌కీని విడుదల చేసే అవకాశం ఉన్నది.

మరోవైపు డీఎస్సీ పరీక్షల్లో ఒకరోజు వచ్చిన ప్రశ్నలు మరోరోజు రావడంపై రేవంత్‌ సర్కార్‌ ఆరా తీయడం ప్రారంభించింది. ఏకంగా 19 ప్రశ్నలు పునరావృతం కావడంపై విద్యాశాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆరా తీశారు. ప్రశ్నలు పునరావృతం కావడంపై పాఠశాల విద్యాశాఖ అధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఈ తప్పిదం ఎలా జరిగింది? ఇందుకు బాధ్యులెవరు? అన్న కోణంలో విచారణ జరుపుతుంది. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

ఎస్జీటీ పరీక్షలో 160 ప్రశ్నలు ఉండగా ఒక్కో ప్రశ్నపత్రంలో 8 వేర్వేరు విభాగాలు ఉంటాయి. మొత్తం 7 సెషన్లకు 14 సెట్ల ప్రశ్నపత్రాలను తయారు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. డీఎస్సీ పరీక్షను ఆన్‌లైన్‌లో జరిగినందున, పేపర్‌ లీక్‌ జరిగే అవకాశం ఉండదన్నారు. జూలై 19న మొదటి సెషన్‌ ప్రశ్నపత్రంలోని సోషల్‌ స్టడీస్‌ సబ్జెక్టులో 18 ప్రశ్నలు, జూలై 23న రెండో సెషన్‌లోనూ పునరావృతమైనట్లు ధృవీకరించారు. జూలై 19న ఆరు జిల్లాలు, జూలై 23న మరో 6 జిల్లాల వారికి ఈ పరీక్షలు జరిగాయి. ఒక సెషన్‌లో ఒక జిల్లా వారికి మాత్రమే పరీక్ష నిర్వహించామని, ఇది అభ్యర్థుల ర్యాంకులను, ఫలితాలను ప్రభావితం చేయదన్నారు. దీనిపై అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన కోరారు. ఈ మేరకు పేపర్‌ లీక్‌ వార్తలపై వస్తున్న పుకార్లకు పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.