TGPSC PET Results 2024: ఎట్టకేలకు టీజీపీఎస్సీ గురుకుల పీఈటీ పోస్టులకు మోక్షం.. త్వరలో ఫలితాలు వెల్లడి

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరిధిలో నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్‌లో ఉన్న పలు రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెడుదల చేయనున్నారు. వీటిల్లో పెండింగ్‌లో ఉన్న గురుకుల పాఠశాలల పీఈటీ పోస్టులు కూడా ఉన్నాయి. సంక్షేమ గురుకులాల్లో..

TGPSC PET Results 2024: ఎట్టకేలకు టీజీపీఎస్సీ గురుకుల పీఈటీ పోస్టులకు మోక్షం.. త్వరలో ఫలితాలు వెల్లడి
TGPSC PET Results
Follow us

|

Updated on: Aug 21, 2024 | 8:05 AM

హైదరాబాద్‌, ఆగస్టు 21: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) పరిధిలో నిర్వహించిన పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన నియామక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. దీర్ఘకాలంగా న్యాయ వివాదాలతో పెండింగ్‌లో ఉన్న పలు రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలు త్వరలో వెడుదల చేయనున్నారు. వీటిల్లో పెండింగ్‌లో ఉన్న గురుకుల పాఠశాలల పీఈటీ పోస్టులు కూడా ఉన్నాయి. సంక్షేమ గురుకులాల్లో 616 పీఈటీ పోస్టుల ఫలితాలను త్వరలో టీజీపీఎస్సీ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ పోస్టులకు 2017లో నోటిఫికేషన్‌ వెల్లడవగా.. రాతపరీక్షలు కూడా పూర్తయ్యాయి. విద్యార్హతలు, వివిధ సాంకేతిక కారణాలతో అప్పటి నుంచి కోర్టులో నానుతూ ఉంది. వాటన్నింటినీ పరిష్కరించి 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా వెలువరించింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ముందు అభ్యర్థుల నుంచి సొసైటీల వారీగా ప్రాధాన్య క్రమంలో ఆప్షన్లు తీసుకుంది. వాటి ప్రకారంగా తుది నియామకాలకు ఏర్పాట్లు చేస్తుంది. మొత్తం పోస్టుల్లో గిరిజన గురుకుల సొసైటీలో 83 పోస్టులు, ఎస్సీ గురుకులాల్లో 182 పోస్టులు, బీసీ గురుకులాల్లో 135 పోస్టులు, మైనార్టీ గురుకులాల్లో 194 పోస్టులు, సాధారణ గురుకులాల్లో 22 పోస్టులు ఉన్నాయి.

గురుకుల సొసైటీ పరిధిలోని ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన పొరపాట్లు టీజీపీఎస్సీ ఇతర నోటిఫికేషన్లలో తలెత్తకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. తొలుత ప్రభుత్వ విభాగాల్లోని 1,540 ఏఈఈ పోస్టుల నియామకం పూర్తి చేసిన కమిషన్‌.. ఆ తరువాత 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్స్‌ జనరల్‌ ర్యాంకు జాబితాను వెల్లడించింది. అక్టోబరులో ఈ పోస్టులన్నింటికి ఎంపికైన వారికి ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయనుంది. ఈ పోస్టుల నియామకాలు పూర్తైతే.. 833 ఏఈ పోస్టులకు ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తుంది. తద్వారా బ్యాక్‌లాగ్‌ పోస్టులు లేకుండా చేయొచ్చనేది సర్కార్ ఆలోచన.

తెలంగాణ ఇంటర్‌ ప్రవేశాల గడువు పెంపు.. ఎప్పటి వరకంటే

తెలంగాణ రాష్ట్రంలో అన్ని జూనియర్‌ కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాల గడువును మరోమారు పొడిగించారు. ఈ మేరకు ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించినట్లు ఇంటర్‌బోర్డు డైరెక్టర్ శ్రుతి ఓజా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి ఇకపై గడువు పెంపు ఉండదని ఆ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఆ పార్టీ క్యాడర్‎లో గందరగోళం.. మంత్రి కాన్వాయ్‎ని అడ్డుకున్న వైనం
ఆ పార్టీ క్యాడర్‎లో గందరగోళం.. మంత్రి కాన్వాయ్‎ని అడ్డుకున్న వైనం
వావ్‌..రైలు బోగీల్లో పుట్టగొడుగుల పెంపకం..! ఎలా సాధ్యమంటారా..?
వావ్‌..రైలు బోగీల్లో పుట్టగొడుగుల పెంపకం..! ఎలా సాధ్యమంటారా..?
ఓటీటీలో నయా రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్ సేతుపతి సినిమా..
ఓటీటీలో నయా రికార్డ్ క్రియేట్ చేసిన విజయ్ సేతుపతి సినిమా..
శవాసనంతో ఎన్ని లాభాలో..​! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ తెలిస్తే..
శవాసనంతో ఎన్ని లాభాలో..​! ఈ ఇంట్రెస్టింగ్ సీక్రెట్‌ తెలిస్తే..
గ్యాస్ సమస్యా.. ఇంట్లోనే ఈ చిట్కాలతో తగ్గించుకోండి..
గ్యాస్ సమస్యా.. ఇంట్లోనే ఈ చిట్కాలతో తగ్గించుకోండి..
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే.. మరో జన్మ ఎత్తాల్సిందే..
ఈ 5 రోహిత్ రికార్డులు బ్రేక్ చేయాలంటే.. మరో జన్మ ఎత్తాల్సిందే..
ఓటీటీలో రచ్చ రంబోలా.. ఈ రొమాంటిక్ సినిమా చూస్తే పిచ్చెక్కల్సిందే.
ఓటీటీలో రచ్చ రంబోలా.. ఈ రొమాంటిక్ సినిమా చూస్తే పిచ్చెక్కల్సిందే.
ఏపీలో ఘోర ప్రమాదం.. రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం..
ఏపీలో ఘోర ప్రమాదం.. రియాక్టర్ పేలి ఆరుగురు దుర్మరణం..
ఎండిన చెట్టు కొమ్మ అనుకున్నారు.. తెరిచి చూడగా భారీ తేనె పట్టు..
ఎండిన చెట్టు కొమ్మ అనుకున్నారు.. తెరిచి చూడగా భారీ తేనె పట్టు..
నిన్న మొన్నటిదాకా ట్రేండింగ్ లో కియారా అద్వానీ పేరు! మరి ఇప్పుడు?
నిన్న మొన్నటిదాకా ట్రేండింగ్ లో కియారా అద్వానీ పేరు! మరి ఇప్పుడు?