AP EAPCET 2024 Counselling : ప్రైవేట్‌ యూనివర్సిటీల ఫీజులు ఖరారు.. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు 1.23 లక్షల రిజిస్ట్రేషన్లు..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసింది. జులై 12 రాత్రి ముగింపు సమయం నాటికి 1.23 లక్షల మంది వెబ్‌ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. వెబ్‌ ఆప్షన్ల నమోదుకు జులై 8 నుంచి 12 వరకు అవకాశం..

AP EAPCET 2024 Counselling : ప్రైవేట్‌ యూనివర్సిటీల ఫీజులు ఖరారు.. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు 1.23 లక్షల రిజిస్ట్రేషన్లు..!
AP EAPCET 2024 Counselling
Follow us

|

Updated on: Jul 13, 2024 | 8:22 AM

అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వివిధ బీటెక్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్‌లో కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసింది. జులై 12 రాత్రి ముగింపు సమయం నాటికి 1.23 లక్షల మంది వెబ్‌ఐచ్ఛికాలు నమోదు చేసుకున్నట్లు ఉన్నత విద్యా మండలి తెలిపింది. వెబ్‌ ఆప్షన్ల నమోదుకు జులై 8 నుంచి 12 వరకు అవకాశం కల్పించారు. జులై 13న (శనివారం) ఐచ్ఛికాలు మార్పు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశం సద్వినియోగపరచుకోవాలని సూచించింది. ఈ రోజు ఉన్నవి మార్చుకోవచ్చు లేదంటే కొత్తగానూ పెట్టుకోవచ్చు.

ప్రైవేట్ కాలేజీల ఫీజులు, అనుమతుల జారీలో ఆలస్యం నెలకొనడతంతో ఐచ్ఛికాల నమోదు ప్రక్రియ ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రైవేటు యూనివర్సిటీల సమాచారం కూడా వెబ్‌సైట్‌లో ఆలస్యంగా పొందుపరిచారు. దీంతో జులై 9వ తేదీ సాయంత్రం వరకు విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కౌన్సెలింగ్‌లో ఎదురైనా ఇబ్బందుల కారణంగా గడువు సమయాన్ని పొడిగిస్తారేమోనని అభ్యర్థులు ఎదురు చూశారు. అయితే మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారంగానే కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో తక్కువ మంది అభ్యర్ధులు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. జులై 16న సీట్ల కేటాయింపు పూర్తైతే.. జులై 17 నుంచి 22 వరకు విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో ప్రవేశాలు పొందవల్సి ఉంటుంది. ఇక జులై 19 నుంచి అన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి.

ప్రైవేటు యూనివర్సిటీల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఈ కింది విధంగా ఉత్తర్వులు జారీచేసింది. కన్వీనర్‌ కోటాలో కల్పించే ప్రవేశాలకు ఈ ఫీజులు వర్తిసాయి.

ఇవి కూడా చదవండి
  • మోహన్‌బాబు యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్‌కు రూ.1.03 లక్షలు, బీబీఏ, బీసీఏ, బీఎస్సీలకు రూ.44,500
  • గోదావరి గ్లోబల్‌ యూనివర్సిటీలో బీటెక్‌కు రూ.60,000, ఎంటెక్‌కు 99,500, బీసీఏకు రూ.37,000, బీఎస్సీకి రూ.35,500
  • ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏలకు రూ.1.02 లక్షలు, బీఎస్సీ, బీకాం, బీఏ, ఎమ్మెస్సీ కోర్సులకు రూ.44,000
  • అన్నమాచార్య యూనివర్సిటీలో బీటెక్‌కు రూ.60వేలు, బీఎస్సీ వ్యవసాయానికి రూ.44,500, బీఎస్సీకి రూ.35,500
  • భారతీయ ఇంజినీరింగ్‌ సైన్సు, టెక్నాలజీ ఇన్నోవేషన్‌ వర్సిటీ(బెస్ట్‌)లో బీటెక్‌కు రూ.69,500, బీసీఏ, బీబీఏలకు రూ.37,000, బీఎస్సీ వ్యవసాయానికి రూ.99,000
  • ఆదిత్య యూనివర్సిటీలో బీటెక్, ఎంసీఏ, ఏంబీఏలకు రూ.60వేలు, ఎంటెక్‌కు రూ.99,500
  • క్రియా యూనివర్సిటీలో ఎంబీఏ, బీఏ, బీఎస్సీ (నాలుగేళ్లు)కి రూ.97,500, బీబీఏ (ఐదేళ్ల)కు రూ.37,000
  • విట్‌లో బీటెక్, ఎంటెక్‌లకు రూ.1.03లక్షలు, బీబీఏ, బీకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీలకు రూ.44,500
  • అపోలో యూనివర్సిటీలో బీటెక్‌కు రూ.99,500

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనా కోసం క్లిక్‌ చేయండి.

శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపాద
శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపాద
బడి నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన బాలిక..
బడి నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన బాలిక..
విల్లాస్‌లో పక్కా అవినీతి జరిగిందిః ఎమ్మెల్యే దామచర్ల
విల్లాస్‌లో పక్కా అవినీతి జరిగిందిః ఎమ్మెల్యే దామచర్ల
మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ
మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ
సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద రణరంగం..ఎక్కడికక్కడ అరెస్టులు! వీడియో
సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద రణరంగం..ఎక్కడికక్కడ అరెస్టులు! వీడియో
వివాహంలో జాప్యమా..! తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే శీఘ్రంగా పెళ్లి
వివాహంలో జాప్యమా..! తొలి ఏకాదశి రోజున ఇలా చేస్తే శీఘ్రంగా పెళ్లి
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
గోల్డ్ లవర్స్‌కి గోల్డెన్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
సొంతూరిలో హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్‌కమ్.. వీడియో చూశారా?
సొంతూరిలో హార్దిక్ పాండ్యాకు గ్రాండ్ వెల్‌కమ్.. వీడియో చూశారా?
ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం ఉందా?
ట్రంప్‌పై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణం ఉందా?
జెన్‌కో AE పరీక్షలో అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం..
జెన్‌కో AE పరీక్షలో అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యం..