TG DSC 2024 Exam Centres: డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే కేంద్రంలో రాయొచ్చు!

తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు మరో 4 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఓ వైపు నిరుద్యోగులు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ పోరుబాట పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించి సర్కార్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఒకే రోజు రెండు సబ్జెక్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే..

TG DSC 2024 Exam Centres: డీఎస్సీ అభ్యర్ధులకు అలర్ట్.. ఒకే రోజు రెండు పరీక్షలుంటే ఒకే కేంద్రంలో రాయొచ్చు!
TG DSC 2024 Exam Centres
Follow us

|

Updated on: Jul 13, 2024 | 8:48 AM

హైదరాబాద్‌, జులై 13: తెలంగాణ డీఎస్సీ 2024 పరీక్షలు మరో 4 రోజుల్లో ప్రారంభంకానున్నాయి. ఓ వైపు నిరుద్యోగులు డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలంటూ పోరుబాట పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదల చేసింది. పరీక్షలకు సంబంధించి సర్కార్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. ఒకే రోజు రెండు సబ్జెక్టులకు సంబంధించిన డీఎస్సీ పరీక్షలు ఉంటే… వారంతా ఉదయం పరీక్ష రాసిన చోటే మధ్యాహ్నం రెండో పరీక్షకు హాజరుకావచ్చని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఎగ్జాం సెంటర్ల విషయంలో ఆందోళన అవసరం లేదని తెలియజేస్తూ అభ్యర్థులకు సూచనలు చేశారు.

కొందరు అభ్యర్థులకు ఉదయం ఒక జిల్లాలో పరీక్ష ఉంటే, మధ్యాహ్నం మరో జిల్లాలో పరీక్షలు ఉన్నాయి. నాన్‌లోకల్‌ పోస్టులకు దరఖాస్తు చేయడంతో ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించారు. దీనిపై అభ్యర్థులు ఆందోళన చెందడంతో.. స్పందించిన విద్యాశాఖ అధికారులు అలాంటి వారు ఒకే రోజు ఒకే పరీక్షా కేంద్రంలో రెండు పరీక్షలు రాసే అవకాశం ఇస్తామని తెలిపారు. ఒకే రోజు వేరువేరు జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు పడిన వారికి హాల్‌టికెట్లు మార్చి.. మళ్లీ జారీ చేస్తామని తెలిపారు. ఒక సబ్జెక్టు తెలుగు, అదే సబ్జెక్టు హిందీ మాధ్యమానికి దరఖాస్తు చేసి ఉంటే.. ప్రధాన మాధ్యమంలో వచ్చిన మార్కులను రెండో దానికి కూడా పరిగణనలోకి తీసుకుంటామని విద్యాశాఖ స్పష్టం చేసింది. కాగా జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్‌లైన్‌ విధానంలో డీఎస్సీ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 2,79,966 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నారు.

ఓయూలో బ్యాక్‌లాగ్స్‌ ఉన్న వారికి ‘వన్‌ టైం ఛాన్స్‌’ ఇస్తూ ప్రకటన జారీ

ఉస్మానియా యూనివర్సిటీ, దాని అనుబంధ కాలేజీల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసుకోవడానికి ప్రకటన వెలువడింది. బ్యాక్‌లాగ్స్‌ ఉన్నవారికి ‘వన్‌ టైం ఛాన్స్‌’కు అవకాశం కల్పించింది. 2000-2001 నుంచి 2018-19 మధ్య ఆయా విద్యా సంవత్సరాల్లో ఓయూతో పాటు దాని అనుబంధ కాలేజీల్లో చదివి.. 4 సెమిస్టర్లు క్లియర్‌ చేయని విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేయగోరే విద్యార్ధులు.. గతంలోని జారీ చేసిన హాల్‌ టికెట్, మార్కుల మెమో కాపీలను జత చేసి ఆగస్టు 16వ తేదీలోపు ఫీజు చెల్లించాలని సూచించింది. రూ.500 ఆలస్యరుసుంతో ఆగస్టు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఓయూ పరీక్షల విభాగం లేదంటే ఓయూ అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనా కోసం క్లిక్‌ చేయండి.

డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.!
డబ్బులున్న మగాళ్లను ప్రేమలోకి ఎలా దింపాలో చెప్పడమే పని.!
మిర్రర్ సెల్ఫీతో మాయ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
మిర్రర్ సెల్ఫీతో మాయ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మను గుర్తు పట్టారా?
తోకతో పుట్టిన చిన్నారి.. వైద్యులు షాక్!
తోకతో పుట్టిన చిన్నారి.. వైద్యులు షాక్!
దోడా ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు వీరమరణం..
దోడా ఎన్‌కౌంటర్‌.. ఆర్మీ అధికారి, ముగ్గురు జవాన్లు వీరమరణం..
అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్
అప్పుడేమో చబ్బీ.. ఇప్పుడేమో అందానికే అటామ్ బాంబ్
ఒకప్పుడు తెగ కొట్టుకున్న ఆ ముగ్గురు.. కలిసి ముందుకెళ్తారా..?
ఒకప్పుడు తెగ కొట్టుకున్న ఆ ముగ్గురు.. కలిసి ముందుకెళ్తారా..?
శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపాద
శ్రీక్షేత్రంలో మరో రహస్య గది.. రాజులు సమర్పించిన విలువైన సంపాద
బడి నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన బాలిక..
బడి నుంచి వెళ్లి.. గ్యాస్‌ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన బాలిక..
విల్లాస్‌లో పక్కా అవినీతి జరిగిందిః ఎమ్మెల్యే దామచర్ల
విల్లాస్‌లో పక్కా అవినీతి జరిగిందిః ఎమ్మెల్యే దామచర్ల
మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ
మహేశ్ బాబు బర్త్ డే స్పెషల్.. రీరిలీజ్ కానున్న బ్లాక్ బస్టర్ మూవీ