Mutual Funds: మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ పనితీరు బాగోలేదా? అయితే, ఇలా చేయండి..

ఎవరైనా రాంగ్ మ్యూచువల్ ఫండ్‌లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, అది వారి అవగాహనా లోపమే అని కచ్చితంగా చెప్పవచ్చు.

Mutual Funds: మీరు ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ పనితీరు బాగోలేదా? అయితే, ఇలా చేయండి..
Mutual Funds
Follow us
Venkata Chari

|

Updated on: Jun 23, 2022 | 8:27 PM

చాలాకాలంగా రాజీవ్ టెన్షన్ పడుతున్నాడు. అతను తన స్నేహితుని సలహాలతో మ్యూచువల్ ఫండ్ పథకంలో డబ్బు పెట్టుబడి పెట్టాడు. ఈ ఫండ్ హౌస్ గురించి ఇటీవల కొన్ని నెగెటివ్ వార్తలు వచ్చాయి. అలాగే దాని ఫండ్ మేనేజర్లలో కొందరు సస్పెండ్ అయ్యారు. ఈ స్కీమ్‌లో తనకు చెప్పుకోదగ్గ రాబడి రాలేదని అతను గమనించాడు. దీంతో రాజీవ్ ప్రస్తుతం తన డబ్బు రాంగ్ ఫండ్‌లో కూరుకుపోయిందని భావిస్తున్నాడు. ఇప్పుడు నిజం ఏంటంటే.. ఏ ఫండ్ లో అయినా ఇలాంటి సంఘటన ఎప్పుడు జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇది అందరికీ తెలియని కొత్త విషయమూ కాదు.

అదేవిధంగా, ఎవరైనా రాంగ్ మ్యూచువల్ ఫండ్‌లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, అది వారి అవగాహనా లోపమే అని కచ్చితంగా చెప్పవచ్చు. పైగా రాజీవ్ తన స్నేహితుడి సలహా మేరకు తనంతట తానుగా ఎలాంటి ప్రత్యేక పరిశోధనలు చేయకుండా అక్కడ డబ్బు పెట్టుబడి పెట్టాడు.

రాజీవ్ లానే మీరు కూడా మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి విషయంలో పొరపాటు చేస్తే.. ఎలా బయటపడాలో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

మీరు తప్పుగా మ్యూచువల్ ఫండ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టినట్లు మీకు అనిపిస్తే, మీరు ఈ పొరపాటు ఎందుకు చేశారో ఆలోచించడం మొదటి అడుగు. మీరు స్నేహితుడి సలహా తీసుకున్నట్లు లేదా ఈ పథకంలో కొంత గొడ్డు పద్ధతిలో పెట్టుబడి పెట్టినట్లయితే దాని విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పవు. ఇన్వెస్టర్ ఫండ్‌లో డబ్బును ఉంచినప్పుడు.. అది చాలా కాలం పాటు నిలకడగా పని చేయకపోతే కచ్చితంగా భయాందోళనలకు గురవుతాడు. కాబట్టి ముందుగా, మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ పరిస్థితి ఏమిటో ఏమిటో అర్థం చేసుకోండి. దీని కోసం, మీరు రోలింగ్ రిటర్న్‌లు, రిస్క్ సర్దుబాటు చేసిన నిష్పత్తి, ఫండ్ మేనేజర్ లేదా AMC ట్రాక్ రికార్డ్ మొదలైన అనేక పారమీటర్స్ చూడాలి. తర్వాత ఇతర మార్కెట్ సైకిల్స్‌లోని ఇతర సారూప్య ఫండ్ స్కీమ్‌లతో దానిని పోల్చి చూసుకోండి.

ఈ కారకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, ఈ రకమైన ఇతర స్కీమ్‌లు లేదా బెంచ్‌మార్క్ ఇండెక్స్‌తో పోల్చితే ఈ పథకం పేలవంగా పని చేస్తుందో లేదో చూడండి. ఇదే జరిగితే బెటర్ ఆప్షన్ మరో ఫండ్‌కి మారడం సహజం.

ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు వ్యాపార చక్రం లేదా మార్కెట్ ఆధారిత స్థూల కారకాలలో మార్పులపై ఆధారపడి వివిధ దశల పనితీరు లేదా అండర్ పెర్ఫార్మెన్స్ ద్వారా వెళతాయని రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ అసోసియేషన్ బోర్డు సభ్యుడు లోవై నవ్‌లాఖి చెప్పారు. ఫండ్‌కు సంబంధించిన ఖచ్చితమైన హోల్డింగ్ వ్యవధి అలాగే సంభావ్య రాబడిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

ఒక ఉదాహరణతో దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. మీరు స్మాల్ క్యాప్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేశారనుకోండి.. అప్పుడు మార్కెట్‌లో స్వల్పకాలిక కరెక్షన్ ఏర్పడి స్మాల్ క్యాప్ స్పేస్‌లో కొంత అస్థిరతను కలిగిస్తుంది.

ఇప్పుడు కనీసం ఐదు సంవత్సరాల పాటు స్మాల్‌క్యాప్ కేటగిరీ ఫండ్‌కు చెందిన పరిస్థితి అలాగే కాలక్రమాన్ని దృష్టిలో ఉంచుకుని, అది ప్రస్తుతం అస్థిరంగా ఉందని, మీరు సరైన ఎంపిక చేసుకోలేదని భావించి దాన్ని రీడీమ్ చేయడం సముచితం కాదు. కానీ, ఇటువంటి ఇతర ఫండ్స్ లేదా బెంచ్‌మార్క్‌లతో పోల్చి చూస్తే, అది పదేపదే పనితీరు తక్కువగా ఉందని చూపిస్తే, మీరు ఈ తప్పును సరిదిద్దుకుని, మెరుగైన ఆప్షన్ ఫండ్‌ను ఎంచుకోవడం మంచిది.

ఇప్పుడు ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవలసిన వాటి గురించి తెలుసుకుందాం..

మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే ముందు, దాని పరిమాణం అలాగే దాని విధానం వంటి లక్షణాలను గుర్తుంచుకోవాలి.

క్వాంటిటేటివ్ వేరియబుల్స్ ఫండ్‌కు సంబంధించిన గత పనితీరును సూచిస్తాయి. అయితే క్వాంటిటేటివ్ వేరియబుల్స్ ఫండ్ మేనేజర్ నైపుణ్యం, పెట్టుబడి పద్ధతి, సిస్టమ్ మొదలైనవాటిని సూచిస్తాయి. ఫండ్ ఎంపిక చాలా కఠినమైన ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో మీరు మీ రిస్క్ ప్రొఫైల్, పెట్టుబడి లక్ష్యం అలాగే ఆర్థిక లక్ష్యాల ఆధారంగా ఎంచుకోవాలి.

కాబట్టి మొత్తంమీద మీరు ఏదైనా రాంగ్ మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ నష్టాలను చవిచూస్తే, మీరు తదుపరి పొరపాటు చేయకుండా ఉండటానికి ఆర్థిక సలహాదారుని సహాయం తీసుకోవడానికి వెనుకాడకండి.