Xiaomi SU7 Electric Car: జియోమీ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ఇదే.. టార్గెట్ మాత్రం ఫిక్స్.. తగ్గేదేలే..
జియోమీ తన పరిధిని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. కేవలం స్మార్ట్ ఫోన్ల తయారీకే పరిమితం కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించింది. అంతేకాక ఓ కొత్త కారును కూడా ఇప్పటికే తయారు చేసి ప్రదర్శించింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే జియోమీ రానున్న పదేళ్లకు ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. పదేళ్ల కాలంలో ప్రపంచంలోనే టాప్ ఐదు ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల్లో ఒకరిగా ఉండాలన్నదే ధ్యేయంగా తాము పనిచేస్తామని పేర్కొంది.

జియోమీ అంటే అందరికీ గుర్తొచ్చేది స్మార్ట్ ఫోన్లే. రెడ్ మీ బ్రాండ్ నేమ్ తో సూపర్ స్మార్ట్ ఫీచర్లున్న ఫోన్లను అతి తక్కువ ధరకే ఈ చైనా కంపెనీ అందిస్తొంది. ఈ క్రమంలో జియోమీ తన పరిధిని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. కేవలం స్మార్ట్ ఫోన్ల తయారీకే పరిమితం కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించింది. అంతేకాక ఓ కొత్త కారును కూడా ఇప్పటికే తయారు చేసి ప్రదర్శించింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే జియోమీ రానున్న పదేళ్లకు ఓ లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. పదేళ్ల కాలంలో ప్రపంచంలోనే టాప్ ఐదు ఎలక్ట్రిక్ కార్ల తయారీదారుల్లో ఒకరిగా ఉండాలన్నదే ధ్యేయంగా తాము పనిచేస్తామని పేర్కొంది. ఈ క్రమంలో జియోమీ ప్రదర్శించిన కారు వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
జియోమీ ఎస్‌యూ7 సెడాన్..
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ జియోమీ గతవారంలో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించింది. ఎస్‌యూ7 గా పిలుస్తున్న ఈ కారు సెడాన్ లుక్ లో ఉంది. అంతేకాక జియోమీ స్మార్ట్ ఫోన్లలోని ఆపరేటింగ్ సిస్టమ్ తో మంచి కనెక్టివిటీని అందిస్తుందని కంపెనీ ప్రకటించింది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఆటో మార్కెట్లో లాంచ్ అవుతున్న వేళ కంపెనీల మధ్య ధరల యుద్ధానికి తెరతీసింది. రానున్న పదేళ్లలో తమ కంపెనీ టాప్ 5 ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారుల్లో ఒకటిగా ఉండాలన్నది తమ లక్ష్యమని జియోమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ తెలిపారు. తమ ఎస్‌యూ7 సెడాన్ కారు పోర్షే, టెస్లా వంటి బ్రాండ్ కార్లతో పోల్చదగిన డ్రీమ్ కారుగా ఆయన అభివర్ణించారు. తమ లక్ష్యం చాలా పెద్దదైనప్పటికీ ఆ దిశగా పక్కా ప్రణాళికతో పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.
బీజింగ్‌లో జరిగిన లాంచ్ ఈవెంట్‌లో లీ జున్ మాట్లాడుతూ రాబోయే 15 నుంచి 20 సంవత్సరాలలో కష్టపడి పనిచేయడం ద్వారా తాము ప్రపంచంలోని టాప్ 5 ఆటోమేకర్లలో ఒకరిగా అవుతాం.. చైనాలో మొత్తం ఆటోమొబైల్ పరిశ్రమను పైకి తీసుకురావడానికి కృషి చేస్తామని అని చెప్పారు. ఈ ఆలోచన తమకు 2021లో ప్రారంభమైందని చెప్పారు. అంతేకాక దశాబ్దం కాలంలో 10 బిలియన్ డాలర్లను (దాదాపు రూ. 83,171 కోట్లు) పెట్టుబడి పెట్టడానికి ప్రతిజ్ఞ చేసింది. ఎక్కడెక్కడ లాంచ్ చేస్తారు అనే విషయాన్ని ఆయన వివరించలేదు. అయితే ప్రస్తుతం చైనా ఈవీ మార్కెట్‌లో మాత్రం ఇది అందుబాటులోకి రానుంది.
ఆటో డ్రైవ్ మోడ్..
కార్ల స్వయంప్రతిపత్త డ్రైవింగ్ సామర్థ్యాలు పరిశ్రమలో ముందంజలో ఉంటాయని లీ చెప్పారు. జియోమీ బ్రాండెడ్ కార్లను 200,000 వాహనాల వార్షిక సామర్థ్యంతో బీజింగ్ ఫ్యాక్టరీలో ప్రభుత్వ-యాజమాన్య వాహన తయారీ సంస్థ బీఏఐసీ గ్రూప్ యూనిట్ ఉత్పత్తి చేస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








