Personal Loans: అత్యవసరంగా డబ్బు కావాలా? తక్కువ వడ్డీపై ఇన్ స్టంట్ లోన్ ఇచ్చే బ్యాంకులివే..

ఈ కొత్త సంవత్సరంలో చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ క్రమంలో మీరు పర్సనల్ లోన్ కి వెళ్లే ముందు వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు ఎంత ఉందో చూసుకోవడం అవసరం. అందుకే మన దేశంలో అతి పెద్ద రుణదాతలైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..

Personal Loans: అత్యవసరంగా డబ్బు కావాలా? తక్కువ వడ్డీపై ఇన్ స్టంట్ లోన్ ఇచ్చే బ్యాంకులివే..
Personal Loan
Follow us

|

Updated on: Feb 13, 2024 | 8:53 AM

పర్సనల్ లోన్లకు ఇటీవల కాలంలో డిమాండ్ బాగా పెరిగింది. ఎక్కువ మంది వీటిని తీసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరిపైనా ఆధారపడకుండా.. ఇన్ స్టంట్ విధానంలో లోన్లు కావాలంటే పర్సనల్ లోన్లే బెస్ట్ ఆప్షన్. అయితే ఈ లోన్లు అధిక వడ్డీ రేటుతో వస్తాయి. ఈ పర్సనల్ లోన్లు తీసుకునే ముందు వడ్డీ రేట్లను తనిఖీ చేయాలి. వివిధ బ్యాంకులతో వడ్డీ రేట్లను సరిపోల్చాలి. ఎందుకంటే ఈ వడ్డీ రేటు ఒక్కో బ్యాంకులో ఒక్కో రకమైన వడ్డీ రేటు ఉంటుంది. పైగా ఈ కొత్త సంవత్సరంలో చాలా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించాయి. ఈ క్రమంలో మీరు పర్సనల్ లోన్ కి వెళ్లే ముందు వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేటు ఎంత ఉందో చూసుకోవడం అవసరం. ఈ క్రమంలో మన దేశంలో అతి పెద్ద రుణదాతలైన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకుల్లో వడ్డీ రేట్లను ఇప్పుడు తెలుసుకుందాం..

క్రెడిట్ స్కోర్ కీలకం..

సాధారణంగా రుణదాతలు ఎక్కువ క్రెడిట్ స్కోర్లు ఉన్నవారికి తక్కువ రేట్లను, తక్కువ స్కోర్లు ఉన్నవారికి ఎక్కువ రేట్లను అమలు చేస్తారు. అందుకే పర్సనల్ లోన్లు తీసుకునే వారు తప్పనిసరిగా తమ క్రెడిట్ రిపోర్టును సరిచూసుకోవాలి. ఈ క్రెడిట్ రిపోర్టు మీ ఓవరాల్ ఆర్థిక పరిస్థితిని చూపిస్తుంది. మీకున్న లోన్లు, వాటిని తిరిగి చెల్లిస్తున్న విధానం, ఏమైనా డిఫాల్ట్ అయ్యారా వంటి వివరాలతో పాటు, మీ రాబడి, ఖర్చుల సమగ్ర సమాచారం ఈ క్రెడిట్ రిపోర్టును బట్టి బ్యాంకర్లు అర్థం చేసుకుంటారు. సాధారణంగా క్రెడిట్ స్కోర్ 650 నుంచి 900 మధ్య ఉంటుంది. మీకు సులభంగా పర్సనల్ లోన్లు మంజూరు కావాలంటే మీ క్రెడిట్ స్కోర్ కనీసం 750 నుంచి 850 మధ్య ఉంటే తక్కువ వడ్డీకే ఎక్కువ పర్సనల్ లోన్ మంజూరు అవుతుంది.

ఈ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ రేటు..

హెచ్డీఎఫ్సీ బ్యాంకు.. ఈ బ్యాంకులో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. అది రూ. 4,999తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. 3నెలల నుంచి 72 నెలల మధ్య రుణ కాలపరిమితితో సంవత్సరానికి 10.75 శాతం నుంచి 24 శాతం వరకు రేట్లు అందిస్తోంది. ఈ బ్యాంకులో గరిష్ట రుణ మొత్తం రూ. 40 లక్షలు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ).. ఈ బ్యాంకులో కార్పొరేట్ ఉద్యోగులకు క్రెడిట్ స్కోర్ల ఆధారంగా 13.75 శాతం నుంచి 17.25 శాతం మధ్య వడ్డీ రేట్లు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అత్యల్పంగా 12.75 శాతం, రక్షణ సిబ్బందికి 12.40 శాతం మాత్రమే వడ్డీ రేటు ఉంటుంది.

కోటక్ మహీంద్రా బ్యాంక్.. దీనిలో 10.99 శాతం వడ్డీ రేటుతో పర్సనల్ లోన్లు ప్రారంభమవుతాయి. రుణం మొత్తంలో 3 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు రూ. 50,000 నుంచి రూ. 40 లక్షల వరకు రుణాలను మంజూరు చేస్తుంది.

ఐసీఐసీఐ బ్యాంక్.. ఈ బ్యాంకులో సంవత్సరానికి 10.65 శాతం నుంచి 16 శాతం మధ్య వడ్డీ రేటు వసూలు చేస్తారు. రుణ మొత్తంలో 2.50 శాతం వరకు ప్రాసెసింగ్ రుసుముతో పాటు ఇతర పన్నులు ఉంటాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ).. ఈ బ్యాంకులో పర్సనల్ లోన్లు 11.15శాతం వడ్డీ రేటుతో ప్రారంభమవుతాయి. ఎస్బీఐ ఖాతా లేని వారికి కూడా రూ. 20 లక్షల వరకు రుణాలను అందిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్