UPI Services: నిన్న ఫ్రాన్స్.. నేడు శ్రీలంక, మారిషస్.. వేగంగా విస్తరిస్తోన్న భారత్ యూపీఐ సేవలు.. త్వరలో మరిన్ని దేశాల్లో..
మన డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు దేశం దాటి విదేశాలలో కూడా అమలవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో యూపీఐ సేవలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో భారతీయ పర్యాటకులు యూపీఐని వినియోగించి ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ.. శ్రీలంక, మారిషస్ దేశాల్లో కూడా యూపీఐ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) కీలక ప్రకటన చేసింది.

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) సేవలలో మన దేశం అగ్రగామిగా నిలుస్తోంది. దేశ వ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న ఈ డిజిటల్ పేమెంట్ విధానం ఇప్పుడు దేశం దాటి విదేశాలలో కూడా అమలవుతోంది. ఇప్పటికే ఫ్రాన్స్ దేశంలో యూపీఐ సేవలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. దీంతో భారతీయ పర్యాటకులు యూపీఐని వినియోగించి ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు మరో అడుగు ముందుకేస్తూ.. శ్రీలంక, మారిషస్ దేశాల్లో కూడా యూపీఐ అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 12న శ్రీలంక, మారిషస్‌లలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సేవలను ప్రారంభించినట్లు తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్‌లు దీనిని శ్రీకారం చుట్టినట్లు చెప్పింది. అలాగే, రూపే కార్డ్ సేవలు కూడా మారిషస్‌లో ప్రారంభమవుతున్నాయి.
తిరుగులేని ఆధిపత్యం..
ఫిన్‌టెక్ ఇన్నోవేషన్, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భారతదేశం అగ్రగామిగా నిలిచిందని, భాగస్వామ్య దేశాలతో దేశ అభివృద్ధి అనుభవాలు, ఆవిష్కరణలను పంచుకోవడంపై ప్రధాని మోదీ బలమైన ప్రాధాన్యతనిచ్చారని ఎంఈఏ తెలిపింది. శ్రీలంక, మారిషస్‌లతో భారతదేశం సంబంధాలను దృష్టిలో పెట్టుకొని దీనిని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రయోగం వేగవంతమైన, అతుకులు లేని డిజిటల్ లావాదేవీలను అందిస్తుందని.. దేశాల మధ్య డిజిటల్ కనెక్టివిటీని పెంపొందిస్తుందని చెప్పింది. తద్వారా విస్తృత వర్గానికి చెందిన ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
వీరికి ప్రయోజనం..
శ్రీలంక, మారిషస్‌లకు ప్రయాణించే భారతీయ పౌరులకు అలాగే భారతదేశానికి ప్రయాణించే మారిషస్ పౌరులకు యూపీఐ సెటిల్‌మెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. మారిషస్‌లో రూపే కార్డ్ సేవల పొడిగింపు మారిషస్‌లోని రూపే మెకానిజం ఆధారంగా మారిషస్ బ్యాంకులు కార్డులను జారీ చేయడానికి, భారతదేశం, మారిషస్‌లో రూపే కార్డ్‌ను ఉపయోగించడాన్ని సులభతరం చేస్తుంది.
ఇప్పటికే ఫ్రాన్స్ లో..
ఈ నెల ప్రారంభంలో, ఫ్రాన్స్ దేశంలో యూపీఐని పని చేయడానికి అనుమతించింది. భారతీయ పర్యాటకులు యూపీఐని ఉపయోగించి ఆన్‌లైన్‌లో టికెట్‌లను కొనుగోలు చేయడం ద్వారా ఈఫిల్ టవర్‌కి తమ సందర్శనను బుక్ చేసుకోవచ్చు. యూపీఐని ఆమోదించిన మొదటి యూరోపియన్ దేశంగా ఫ్రాన్స్ నిలిచింది. భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్స్‌లోని భారత రాయబార కార్యాలయం నిర్వహించిన కార్యక్రమంలో పారిస్‌లో ఈ అధికారిక ప్రకటన చేసింది. ఫ్రాన్స్‌లో యూపీఐ చెల్లింపులను అందించిన మొదటి వ్యాపారిగా ఈఫిల్ టవర్ నిలిచింది. టూరిజం, రిటైల్ స్పేస్‌లోని ఇతర వ్యాపారులకు దీనిని విస్తరింపజేయనున్నట్లు ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ వెల్లడించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








