AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wagon R: సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ

దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మారుతీ సుజుకి కంపెనీ తయారు చేసిన వ్యాగన్ ఆర్ తప్పనిసరిగా ఉంటుంది. కొన్నేళ్లుగా ఆటో మార్కెట్ లో దీని విక్రయాలు స్థిరంగా జరుగుతున్నాయి. కాలానుగుణంగా ఈ కారులో వివిధ మార్పులను తీసుకువచ్చారు. లేటెస్టు ఫీచర్లు, ఆధునిక టెక్నాలజీతో అందంగా తీర్చిదిద్దారు. అయితే ఇటీవల ఈ కారు ధరను పెంచుతూ కంపెనీ నిర్ణయం తీసుకుంది.

Wagon R: సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
Wagon R
Nikhil
|

Updated on: Feb 18, 2025 | 12:14 PM

Share

మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ పాత ధర కంటే దాదాపు రూ.15 వేలు పెంచింది. కాగా.. ఈ పెరుగుదల మోడల్, వేరియంట్ ఆధారంగా రూ.32,500 వరకూ ఉంటుంది. మారుతీ సుజుకి వ్యాగన్ ఆర్ నాలుగు వేరియంట్లు, తొమ్మిది రకాల విభిన్న రంగులలో అందుబాటులో ఉంది. 1.0 లీటర్, 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోలు ఇంజిన్లతో లభిస్తుంది. ట్రాన్స్ మిషన్ ఎంపిక ల్లో ఐదు స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఏఎంటీ ఏర్పాటు చేశారు. పెట్రోలు – సీఎన్ జీ ఇంధన వేరియంట్ ను కూడా మార్కెట్ లోకి తీసుకువచ్చారు. 1.0 లీటర్ పెట్రోలు మోటారు నుంచి 55.92 బీహెచ్పీ గరిష్ట శక్తి, 92.1 ఎన్ఎం అధిక టార్కు విడుదల అవుతుంది. అలాగే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ నుంచి 88.5 బీహెచ్పీ, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి అవుతుంది. ఇంజిన్ వేరియంట్లకు అనుగుణంగా లీటర్ కు సుమారు 24 నుంచి 25 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుంది.

మారుతీ సుజుకి వ్యాగర్ ఆర్ ధర రూ.15 వేల వరకూ పెరిగింది. వీఎక్స్ఐ 1.0 ఏజీఎస్, జెడ్ ఎక్స్ఐ 1.2 ఏజీఎస్, జెడ్ ఎక్స్ ప్లస్ 1.2 ఏజీఎస్, జెడ్ ఎక్స్ ఐ ప్లస్ ఏజీఎస్ డ్యూయల్ టోన్ వేరియంట్లకు ఈ పెరుగుదల వర్తిస్తుంది. మిగిలిన అన్ని రకాల వేరియంట్లకు రూ.పది వేల చొప్పున పెరుగుదల నెలకొంది. పెరిగిన ధరల ప్రకారం ఆ కార్ల ధరలు (ఎక్స్ ఫోరూమ్) ఇలా ఉన్నాయి.

  • బేస్ వేరియంట్ (ఎల్ఎక్స్ఐ) రూ.5.64 లక్షలు
  • వీఎక్స్ఐ రూ.6.09 లక్షలు
  • జెడ్ ఎక్స్ఐ రూ.6.38 లక్షలు
  • ఎల్ఎక్స్ఐ సీఎన్జీ రూ.6.54 లక్షలు
  • వీఎక్స్ఐ ఏజీఎస్ రూ.6.59 లక్షలు
  • జెడ్ఎక్స్ఐ ప్లస్ రూ.6.85 లక్షలు
  • జెడ్ఎక్స్ఐ ఏజీఎస్ రూ.6.88 లక్షలు
  • ఎల్ఎక్స్ఐ సీఎన్జీ రూ.6.99 లక్షలు
  • జెడ్ఎక్స్ఐ ప్లస్ ఏజీఎస్ రూ.7.35 లక్షలు

మారుతీ వ్యాగన్ ఆర్ కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అలాగే అనేక ప్రధాన కంపెనీల వాహనాలతో పోటీ పడుతోంది. వీటిలో మారుతీ సెలెరియా, ఎస్ ప్రెస్సో, రెనాల్డ్ క్విడ్, హ్యుందాయ్ గ్రాంట్ నియోస్ ఐ10 వంటి హ్యచ్ బ్యాక్ కార్లు ఉన్నాయి. అలాగే టాటా పంచ్, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్డ్ కిగర్ వంటి ఎస్ యూవీలతో కూడా పోటీ నెలకొంది. వాహనాల తయారీ ఖర్చులు పెరగడం, మార్కెట్ వ్యూహాలు తదితర అంశాలు ధరలను పెంచడానికి కారణమని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!