మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా? లోన్ రాదని కంగారుపడకండి.. ఈ చిన్న ట్రిక్‌తో లక్షల్లో లోన్ పొందొచ్చు!
లోన్ కావాలని బ్యాంకులు లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థల వద్దకు మనం వెళ్తే వాళ్లు మనల్ని అడిగే ప్రశ్న.. మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంది? లోన్ మంజూరు చేయాలంటే సిబిల్ స్కోర్ ఎంతో కీలకం, పర్సనల్, హోం లోన్ ఇలా ఏ లోన్ కావాలన్నా సిబిల్ స్కోర్‌ను చెక్ చేస్తారు. అది తక్కువుంటే లోన్ ఇవ్వరు. అయితే సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా, అసలు సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్ పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

మనలో చాలా మంది ఏదో ఒక అవసరానికి లోన్ తీసుకునేందుకు ప్రయత్నిస్తాం.. అప్పుడు మనకు లోన్ ఇచ్చే బ్యాంకు వాళ్లు అడిగేది సిబిల్ స్కోర్. దాన్ని బట్టే మనకు లోన్ ఇవ్వాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతుంది. అంత కీలకమైన సిబిల్ స్కోర్ కొంతమందికి చాలా తక్కువగా ఉంటుంది. దాంతో వారికి లోన్‌లు రావు. అయితే.. ఇప్పుడు మన చెప్పుకోబోయే చిన్న ట్రిక్‌తో మీ సిబిల్ తక్కువగా ఉన్నా.. మీకు లక్షల్లో లోన్ గ్యారెంటీగా వస్తుంది. సిబిల్ స్కోర్ సాధారణంగా 300 నుంచి 900 పాయింట్లు మధ్యలో కేటాయిస్తుంటారు.
సిబిల్ స్కోర్ అనేది కస్టమర్ తాను చెల్లించే అప్పులను, క్రెడిట్ కార్డ్ బిల్లులను సకాలంలో చెల్లించినట్లయితే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. లేకపోతే ఈ క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది. 750 కన్నా ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నట్లయితే మీకు రుణం పొందే అర్హత పెరుగుతుంది. అదే సమయంలో 600 కన్నా తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నట్లయితే మీరు రుణం పొందడం దాదాపు కష్టం అని చెప్పవచ్చు. మరి తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నవాళ్లకు లోన్ రావా అంటే వస్తాయి. ఇలా చేస్తే వస్తాయి.. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ సంస్థలు బంగారు ఆభరణాలపై రుణాలను అందిస్తుంటాయి. మార్కెట్లో బంగారం ధర ఎంత ఉందో ఆ ధర కన్నా 30% తక్కువ మొత్తం మీకు లభిస్తుంది. ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టడం ద్వారా సులభంగా రుణ పొందవచ్చు. దీనికి ఎలాంటి క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అవసరం లేదు.
అలాగే కొన్ని బ్యాంకులు ఆస్తి పత్రాలను తనఖా పెట్టుకొని అందించే రుణాలను సెక్యూర్డ్ రుణాలు అంటారు. ఇలాంటి సెక్యూర్డ్ రుణాలను పొందేందుకు ఎలాంటి క్రెడిట్ స్కోర్ అవసరం లేదు. మీ ఆస్తి విలువను బట్టి రుణం లభిస్తుంది. మీకు అవసరం అనుకుంటే సిబిల్ తక్కువ ఉన్నా, అసలు సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండానే ఈ లోన్లు పొందవచ్చు. ఈ లోన్లు తీసుకున్న తర్వాత మీరు తిరిగి ఈఎంఐలు సకాలంలో అన్ని చెల్లిస్తే.. ఎలాగో మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఆ తర్వాత బంగారం, ఆస్తి పత్రాలు లేకుండా కూడా మీరు బ్యాంక్‌లో పర్సనల్, హోమ్ లోన్స్ తీసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.